చిన్ని రోల్‌లో చిన్నోడు | taimur khan guest role in good news | Sakshi
Sakshi News home page

చిన్ని రోల్‌లో చిన్నోడు

Published Tue, Apr 2 2019 6:32 AM | Last Updated on Tue, Apr 2 2019 6:32 AM

taimur khan guest role in good news - Sakshi

తైముర్‌ అలీఖాన్‌

ముంబై ఇండస్ట్రీ సర్కిల్లో తైముర్‌ అలీఖాన్‌ తెలియనివారుండరు. సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ ముద్దుల తనయుడు తైముర్‌ అలీఖాన్‌. బయట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లకు పని పెడుతుంటాడు ఈ బుడతడు. వారానికొక్కసారైనా తన కొత్త స్టిల్స్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంటాడు. ఆ మధ్య తైముర్‌ బొమ్మలను తయారు చేసి కేరళలో అమ్మారు కూడా. రెండేళ్లు నిండిన ఈ బుడతడు తాజాగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అక్షయ్‌ కుమార్, కరీనా కపూర్‌ నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘గుడ్‌ న్యూస్‌’లో చిన్న గెస్ట్‌ రోల్‌ చేయనున్నాడట ఈ చిన్నోడు. పది నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడట.  తన పార్ట్‌ షూటింగ్‌ కూడా పూర్తి చేశాడట తైముర్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మరి కొన్ని సినిమాల్లో కనిపిస్తాడా?  వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement