Taimur alikhan
-
ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు
బాలీవుడ్ జంట కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. వివాహం నుంచి సంతానం వరకూ వ్యక్తిగత జీవితంలో ‘సైఫీనా’గా గుర్తింపు పొందిన ఈ దంపతులు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ కపుల్‌కి పుట్టిన రెండో సంతానానికి సంబంధించి కూడా నెట్టిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో పిల్లలకు పేర్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుందని కరీనా సోషల్ మీడియా వేదికగా మండిపడింది కరీనా. ఈ జంటకు 2016లో ఓ కుమారుడు జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు పుట్టాడు. అయితే మొదటి సంతానాకి ‘తైమూర్ అలీఖాన్’ అని పెట్టగా వివాదాలకు కారణమయినా విషయం తెలిసిందే. అది 1398లో భారతదేశంపై దండెత్తిన పర్షియన్ చక్రవర్తి తైమూర్‌ని గుర్తు చేస్తోందని నెటిజన్లు అప్పట్లో విమర్శలు చేశారు. కాగా రెండో కుమారుడికి ‘జహంగీర్ అలీఖాన్’ అని పెట్టారు. అదీసైతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో కాంట్రవర్సీ ఎందుకని ‘సైఫీనా’ జంట బాబు పేరు ‘జెహ్’గా మార్చారు. దీనిపై స్పందిస్తూ కరీనా ఇన్‌స్టాలో రెండో కుమారుడితో ఉన్న ఫోటోని తాజాగా పోస్ట్ చేసింది. ‘పిల్లలను కనిపెంచే తల్లిదండ్రులకి మాత్రమే వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మరెవరీకి ఉండదు. ఇతర కుటుంబ సభ్యులకి కూడా లేదు. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని’ అందులో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వూలో ట్రోల్‌పై స్పందించిన కరీనా మాకు నచ్చిన పేర్లను, బావుంటాయని పిల్లలకి పెట్టామని వెల్లడించింది. అంతేకానీ మరేంకాదని తెలిపింది. పిల్లలని భయంకరంగా ఇలా ఎలా ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ సోదరి సభా పటౌడి కరీనాకు మద్దతుగా నిలిచింది. View this post on Instagram A post shared by Saba (@sabapataudi) -
మీ ప్రేమ కావాలి!
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ అన్నయ్య కాబోతున్నాడు. విషయం అర్థం అయ్యే ఉంటుంది. అదేనండీ కరీనా మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. 2012 అక్టోబర్‌లో సైఫ్, కరీనా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్లో తైముర్‌కి జన్మనిచ్చారు కరీనా. ‘‘మా కుటుంబంలోకి మరొకరిని ఆహ్వానించబోతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలు మా మీద ఉన్నట్లే మా ఫ్యామిలీలో యాడ్ కాబోతున్న మా నంబర్ 2 మీద ఉండాలని కోరుకుంటున్నాం’’ అని సైఫీనా (సైఫ్, కరీనాను బాలీవుడ్లో అలానే అంటారు) అన్నారు. -
చిన్ని రోల్లో చిన్నోడు
ముంబై ఇండస్ట్రీ సర్కిల్లో తైముర్ అలీఖాన్ తెలియనివారుండరు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్. బయట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లకు పని పెడుతుంటాడు ఈ బుడతడు. వారానికొక్కసారైనా తన కొత్త స్టిల్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఆ మధ్య తైముర్ బొమ్మలను తయారు చేసి కేరళలో అమ్మారు కూడా. రెండేళ్లు నిండిన ఈ బుడతడు తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గుడ్ న్యూస్’లో చిన్న గెస్ట్ రోల్ చేయనున్నాడట ఈ చిన్నోడు. పది నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడట. తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశాడట తైముర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మరి కొన్ని సినిమాల్లో కనిపిస్తాడా? వేచి చూడాలి. -
నాకూ ఒకటి పంపండి
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్‌కు బాలీవుడ్లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. తైమూర్ బయట కనిపిస్తే కెమెరాలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటాయి. ఒక్కో ఫొటోకు సుమారు 1500 వరకూ చెల్లించి మరీ తీసుకుంటున్నాయి బాలీవుడ్ వెబ్సైట్లు. తైమూర్ బొమ్మలను కూడా తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారంటే ఈ బుడతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సైఫ్‌ని అడగ్గా– ‘‘వాడి పేరుని ట్రేడ్ మార్క్ చేసుకోవాలేమో? నాకూ ఓ బొమ్మ పంపండి. వాడి ద్వారా కొందరైనా లాభం పొందుతున్నారంటే అంతకు మించి కావాల్సింది ఏముంది. వీటన్నింటికీ బదులుగా వాడు సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అని పేర్కొన్నారు సైఫ్. -
నా బట్టలు.. నా ఇష్టం
సోషల్ మీడియా వచ్చేసరికి మా ఒపీనియన్‌ని వెలిబుచ్చుతున్నాం అంటూ సెలబ్రిటీలను కామెంట్ చేసేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువైపోతోంది. తైముర్ పుట్టాక కూడా కరీనా కపూర్ ఖాన్ ఇంకా తల్లిలా డ్రెస్ చేసుకోవడం లేదంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ కామెంట్స్‌ను కరీనా తిప్పికొడుతూ – ‘‘ఎవరైనా తమకి ఏది నప్పుతుందో, ఏది సౌకర్యంగా అనిపిస్తుందో అలాంటి బట్టలు ధరించాలి. మదర్‌లా డ్రెస్ చేసుకోవడం అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మగారు (బబితా కపూర్) ఇంకా మోడ్రన్ దుస్తులనే ధరిస్తారు. మా అత్తగారు (నటి షర్మిలా ఠాగూర్) కూడా. మాకు ఏం నచ్చిందో అవి వేసుకునే స్వాతంత్య్రం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చా. కేవలం నేనో పిల్లాడికి తల్లిని కాబట్టి షార్ట్ డ్రెస్‌లు వేసుకోకూడదు అనుకోవటం మూర్ఖత్వం. నా బట్టలు. నా ఇష్టం. కాన్ఫిడెన్స్ ఉండి, వేసుకున్న డ్రెస్‌ని చక్కగా క్యారీ చేయగలగమనే నమ్మకం ఉంటే మనకు ఇష్టమొచ్చిన డ్రెస్సును మనం వేసుకోవచ్చు’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. -
సోషల్ మీడియాలో తైమూర్ మళ్లీ వైరల్
తైమూర్ అలీఖాన్ పటౌడీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బుడతడు తన పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఈ బుజ్జిగాడి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్అలీ ఖాన్ గారాల తనయుడు తైముర్ ఫోటో కొద్ది గంటల్లోనే లైక్‌లు సంపాదించేసింది. తైమూర్‌కు ఏకంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఖాతానే ఓపెన్ చేసేశారు. స్ట్రోలర్‌లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న తైమూర్ ఫోటో కొద్ది గంటల్లోనే అందరి మనసులు దోచేసింది. అచ్చం అమ్మలాగే ఉన్నాడంటూ అభిమానులు బుడతడికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కరీనా గత ఏడాది డిసెంబర్ 20న తైమూర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన బిడ్డకు తైమూర్ అలీఖాన్ పటౌడీ నవాబ్ అని పేరు పెట్టడం అప్పట్లో పెద్ద దూమారం రేగింది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. గతంలోనూ కరీనా... తైమూర్‌ను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటో కూడా ఇంటర్నెట్లో క్రేజీగా మారిన విషయం తెలిసిందే.