సోషల్‌ మీడియాలో తైమూర్‌ మళ్లీ వైరల్‌ | Kareena Kapoor's Bundle Of Joy Taimur Is Breaking The Internet Again | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో తైమూర్‌ మళ్లీ వైరల్‌

Published Tue, May 9 2017 12:58 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

Kareena Kapoor's Bundle Of Joy Taimur Is Breaking The Internet Again

తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బుడతడు తన పేరుతోనే పాపులర్‌ అయ్యాడు. ఈ బుజ్జిగాడి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది. బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌, సైఫ్‌అలీ ఖాన్‌ గారాల తనయుడు తైముర్‌ ఫోటో కొద్ది గంటల్లోనే లైక్‌లు సంపాదించేసింది. తైమూర్‌కు ఏకంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఖాతానే ఓపెన్‌ చేసేశారు.

స్ట్రోలర్‌లో కూర్చొని  చిరునవ్వులు చిందిస్తున్న తైమూర్‌ ఫోటో కొద్ది గంటల్లోనే అందరి మనసులు దోచేసింది. అచ్చం అమ్మలాగే ఉన్నాడంటూ అభిమానులు బుడతడికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కరీనా‌ గత ఏడాది డిసెంబర్ 20న తైమూర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన బిడ్డకు తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ నవాబ్‌ అని పేరు పెట్టడం అప్పట్లో పెద్ద దూమారం రేగింది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. గతంలోనూ కరీనా... తైమూర్‌ను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటో కూడా ఇంటర్‌నెట్‌లో క్రేజీగా మారిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement