
కుమారుడు తైమూర్‌తో సైఫ్ అలీఖాన్, కరీనా
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ అన్నయ్య కాబోతున్నాడు. విషయం అర్థం అయ్యే ఉంటుంది. అదేనండీ కరీనా మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. 2012 అక్టోబర్‌లో సైఫ్, కరీనా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్‌లో తైముర్‌కి జన్మనిచ్చారు కరీనా. ‘‘మా కుటుంబంలోకి మరొకరిని ఆహ్వానించబోతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలు మా మీద ఉన్నట్లే మా ఫ్యామిలీలో యాడ్ కాబోతున్న మా నంబర్ 2 మీద ఉండాలని కోరుకుంటున్నాం’’ అని సైఫీనా (సైఫ్, కరీనాను బాలీవుడ్‌లో అలానే అంటారు) అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment