ఇవేవి నా అభిరుచిని ఆపలేదు: కరీనా | Kareena Kapoor Khan Thanks To Aamir Khan And Movie Team | Sakshi
Sakshi News home page

‘ఆమిర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు’

Published Thu, Oct 15 2020 5:15 PM | Last Updated on Thu, Oct 15 2020 6:01 PM

Kareena Kapoor Khan Thanks To Aamir Khan And Movie Team - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘లాల్ సింగ్‌ చద్దా’‌ సినిమా హీరో ఆమిర్‌ ఖాన్‌, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్యేగ సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కరీనా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. షూటింగ్ సెట్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి ఉన్న ఫొటోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ హృదయపూర్వ లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం మహమ్మారి కాలానికి తోడు తను గర్భవతి అయినందున షూటింగ్‌లో తనకు ఇంటి వాతావరణం కల్పిస్తూ, భద్రత కల్పిస్తున్న హీరో ఆమిర్‌, చిత్ర సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఙతలు తెలిపారు. (చదవండి: మేకప్‌ లేని ఫోటో షేర్‌ చేసిన హీరోయిన్‌!)

‘చివరకు అన్ని ప్రయాణాలు ముగించాల్సిందే. ఈ రోజు నా తాజా చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సెట్స్‌లో ఉన్నాను. ప్రస్తుత మహమ్మారి పరిస్థితులు, పైగా గర్భవతిని. భయంగా ఉన్నప్పటికీ.. ఇవేవి నటించాలన్న నా అభిరుచిని ఆపలేదు. ఎందుకంటే అన్ని సంరక్షణ మార్గదర్శకాల మధ్య షూటింగ్‌ జరుగుతోంది. ఈ భయంకర పరిస్థితుల్లో కూడా నాకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఇచ్చిన హీరో ఆమిర్‌ ఖాన్‌కు, దర్శకుడు అద్వైత్‌ చందన్‌తో పాటు అద్భుతమైన మా చిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ కరీనా రాసుకొచ్చారు. అయితే 1994 టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ను దర్శకుడు అద్వైత్‌ చందన్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కావడంతో ఢిల్లీలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’కు ఆమిర్ ఖాన్‌‌ సహా నిర్మాత వ్యవహరిస్తున్నాడు. (చదవండి: అంతా సెట్లోనే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement