సైఫ్ అలీఖాన్, తైమూర్ అలీఖాన్
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్‌కు బాలీవుడ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. తైమూర్ బయట కనిపిస్తే కెమెరాలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటాయి. ఒక్కో ఫొటోకు సుమారు 1500 వరకూ చెల్లించి మరీ తీసుకుంటున్నాయి బాలీవుడ్ వెబ్‌సైట్లు. తైమూర్ బొమ్మలను కూడా తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నారంటే ఈ బుడతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని సైఫ్‌ని అడగ్గా– ‘‘వాడి పేరుని ట్రేడ్ మార్క్ చేసుకోవాలేమో? నాకూ ఓ బొమ్మ పంపండి. వాడి ద్వారా కొందరైనా లాభం పొందుతున్నారంటే అంతకు మించి కావాల్సింది ఏముంది. వీటన్నింటికీ బదులుగా వాడు సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను’’ అని పేర్కొన్నారు సైఫ్.
Comments
Please login to add a commentAdd a comment