
కరీనా కపూర్
కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇందుకు సాక్ష్యంగా ‘గుడ్‌న్యూస్’ సినిమా సెట్‌లో కరీనా పాల్గొన్న ఫొటోలను చూపిస్తున్నాయి. ఆ ఫొటోలను చూసి కరీనా గర్భవతి అని కొందరు ఊహించుకున్నారు. అయితే కరీనా గర్భవతిగా కనిపించబోతున్నది వెండితెరపై. సంతానం కోసం తాపత్రయపడే భార్యాభర్తల నేపథ్యంలో సాగే చిత్రం ‘గుడ్‌న్యూస్’. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జీత్ సింగ్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూట్‌లోనే ప్రెగ్నెంట్ లేడీ గెటప్‌లో కనిపించారు కరీనా. ఇదిలా ఉంటే 2012లో సైఫ్, కరీనాలకు పెళ్లైన విషయం, వీరికి రెండేళ్ల కుమారుడు తైముర్ అలీఖాన్ ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment