చాలామంది సెలబ్రెటీలు వేసుకునే మేకప్ చాలా నేచరల్‌గా ఉంటుంది. ఎంతలా అంటే చూస్తే చాలా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ల చర్మం అంత కాంతివంతంగా ఉంటుందేమో అన్నట్లుగా ఆకట్టుకుంటుంది. అదే మనం ట్రై చేస్తే..కచ్చితంగా మేకప్ వేసుకున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత డబ్బు వెచ్చించినా అంతలా నేచురల్‌గా అనిపించదు. అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్‌ని బాలీవుడ్ భామ కరీనా కపూర్ బయపెట్టింది. అందేంటంటే..?
కరీనా కపూర్ మేకప్ వేసుకుంటే ముఖంపై చిన్న మచ్చ కూడా లేనట్లు ప్రకాశంతంగా ఉంటుంది. నిజంగా ఆమె మేకప్ వేసుకుందా..! లేదా? అన్నట్లు ఆశ్చర్యంగా ఉంటుంది. అంతలా ముగ్ధమనోహరంగా ఉంటుంది ఆమె రూపు. అంతలా ఆకట్టుకునే కనపించడానికి వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..మేకప్ లుక్ మంచిగా కనిపించేలా ముందు..ముఖంపైన చర్మం హైడ్రైట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ముందుగా మంచి మాస్క్ వేసుకుని ఉంటారు. ఆ తర్వాత మాయిశ్చరైజేషన్ ముఖానికి ఇంకిపోయాలా అప్లే చేస్తారు. ఆ తర్వాత మేకప్ వేయడం స్టార్ట్ అవుతుంది. ఆమె తదుపరి చిత్రం 'ది క్రూ' షూటింగ్‌లో భాగంగా ఫేస్ మేకప్‌కి ముందు జరిగే తతంగాన్ని మొత్తం ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఐలైనర్ దగ్గర నుంచి పెదవులకు వేసుకునే లిప్‌స్టిక్ వరకు ఎలా మేకప్ మ్యాన్‌లు వేస్తారో సవివరంగా ఉంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!)
Comments
Please login to add a commentAdd a comment