Three Little Girls Dancing to Kareena Kapoor Song Dupatta Mera Video Viral - Sakshi
Sakshi News home page

దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..

Published Sun, Nov 7 2021 4:57 PM | Last Updated on Sun, Nov 7 2021 5:23 PM

Little Girls Energetically Dancing To Kareena Kapoor Song Dupatta Mera Has Gone Viral  - Sakshi

ఇటీవల కాలంటో ప్రముఖ సినీ నటుల పాటలకు నృత్యం చేసిన వీడియోలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవ్వడం చూస్తునే ఉన్నాం. ఈ మేరకు ఇలా పెళ్లి ఫంక్షన్స్‌లోనూ లేక పార్టీల్లోనూ డ్యాన్స్‌ చేసిన వీడియోలతో మచి పేరు ప్రఖ్యాతుల సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. 

(చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!)

అచ్చం అలానే  ఇక్కడ ఒక ముగ్గురు చిన్నారులు భలే డ్యాన్స్‌ చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకెళ్లితే... ముగ్గురు అమ్మాయిలు సల్వార్‌, కుర్తా వంటి దుస్తులు ధరించి బాలీవుడ్‌ ప్రముఖ నటి కరీనా కపూర్‌కి సంబంధించిన "దుపట్టా మేరా" పాటకు ఈ ముగ్గురు అమ్మాయిలు అత్యంత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేశారు.

అయితే దుపట్టా మేరా అనే పాట కరీనా కపూర్, తుషార్ కపూర్  అమ్రిష్ పూరి ప్రధాన పాత్రల్లో నటించిన 2001లో వచ్చిన  ముజే కుచ్ కెహనా హై చిత్రంలోనిది. పైగా ఈ పాటను , అను మాలిక్ సంగీతం సమకూర్చగా అనురాధ శ్రీరామ్ పాడారు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియోను డ్యాన్సర్‌ ఉదయ్‌సింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు "బహుత్ హార్డ్ డ్యాన్స్ హై" అంటే రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: నేను ప్రధానమంత్రి అయితే నా మొదటి సంతకం ఆ బిల్లు పైనే !)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement