
కరీనా కపూర్
‘‘యాక్టర్‌గా రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడుతుంటాం. ఈ హడావిడిలో మళ్లీ హుషారుగా పరిగెత్తాలంటే సెలవు తీసుకోవాలని సెలవిస్తున్నారు బాలీవుడు భామ కరీనా కపూర్. సెలవు తీసుకోవడం గురించి కరీనా మాట్లాడుతూ – ‘‘పని చేస్తున్నప్పుడు మన బెస్ట్ ఇస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడూ పని చేస్తుండటానికి మనమేం మిషన్లు కాదు. కొన్ని సార్లు బ్రేక్ తీసుకొని జీవితాన్ని ఆస్వాదించాలి. ఇలా సెలవు తీసుకోవడం నాకు చాలా ఇష్టం. మనలో కొత్త ఉత్సాహం నింపుకోవడానికి హాలీడేస్ బాగా ఉపయోగపడతాయి. ఆ హాలీడేను నా ఫ్యామిలీ, నా దగ్గరి వాళ్లతో గడపటానికి ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారామె. బాబుకు జన్మనిచ్చాక కరీనా నటించిన ‘వీరే ది వెడ్డిం గ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment