క‌రీనా సినిమాల‌ను బాయ్‌కాట్ చేయాలి | Boycott Kareena Kapoors Cinema After She Commented On Nepotism | Sakshi
Sakshi News home page

'స్టార్ కిడ్స్ సినిమాలు న‌చ్చ‌క‌పోతే చూడ‌కండి'

Aug 11 2020 12:29 PM | Updated on Aug 11 2020 1:37 PM

Boycott Kareena Kapoors Cinema After She Commented On Nepotism - Sakshi

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో మొద‌లైన నెపోటిజంపై చ‌ర్చ నేటికీ కొన‌సాగుతోంది. స్టార్ కిడ్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో క‌రీనా కూడా చేరింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నెపోటిజంపై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన  క‌రీనా క‌పూర్‌ను నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. క‌రీనా చిత్రాల‌ను బాయ్‌కాట్ చేయాలంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు బర్ఖాద‌త్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నెపోటిజం  చ‌ర్చకు రాగా క‌రీనా స్పందిస్తూ.. ‘బాలీవుడ్‌లో మాత్ర‌మే నెపోటిజం ఉన్న‌ట్లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సుశాంత్ మ‌ర‌ణంతో ఇది తారా స్థాయికి చేరింది. స్టార్‌కిడ్స్‌ని ఇండ‌స్ర్టీలోకి తెచ్చిన‌ప్పుడు ఈ ప్రేక్ష‌కులే క‌దా వాళ్ల‌ని అస‌లైన స్టార్స్‌గా చేసేది. ఒకరికి స్టార్ ఇమేజ్ తేవాల‌న్నా, దాన్ని బ్రేక్ చేయాల‌న్నా అది వారి చేతిలోనే ఉంటుంది. స‌రే స్టార్ కిడ్స్ సినిమాలు న‌చ్చ‌క‌పోతే చూడ‌టం మానేయండి. మిమ్మ‌ల్ని ఎవ‌రూ బ‌ల‌వంతంగా సినిమా చూడ‌మ‌ని చెప్ప‌రు క‌దా’ అంటూ ఫైర్ అయ్యారు. (ఓటీటీలో సడక్‌ 2)

క‌రీనా వ్యాఖ్యలపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆమెకు అహంకారం బాగా పెరిగింద‌ని, ఆమె సినిమాలు బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజ‌న్లు అంతేకాకుండా ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై కూడా విప‌రీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రి ర‌ణ్‌ధీర్ క‌పూర్, కుమార్తెగా, క‌రిష్మా క‌పూర్ సోద‌రిగా ఇండ‌స్ర్టీలో అడుగుపెట్టిన క‌రీనా స్టార్ హీరోయిన్‌గా చ‌లామ‌ణి అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అమీర్ ఖాన్‌తో క‌లిసి లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో న‌టిస్తుంది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో సినిమా విడుద‌ల చేయాల‌ని భావించానా ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే ప్ర‌స్తుతం క‌రీనా క‌పూర్‌పూ ట్రోల్స్ కార‌ణంగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చ‌ద్దా అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతోంది. (లాల్‌సింగ్‌ వాయిదా పడ్డాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement