![Saif Ali Khan Said Im Not Shah Rukh Khan I Dont Have That Kind Of Money - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/26/saif.jpg.webp?itok=i0FBPh-x)
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (ఫైల్ ఫోటో)
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ కెరీర్‌లో అత్యంత మెరుగైన దశను ఎంజాయ్ చేస్తున్నా గతంలో తనకు ఎదురైన గడ్డు పరిస్థితులపై బాహాటంగా ఆవేదన వెళ్లగక్కారు. కరీనా కపూర్, తనయుడు తైమూర్‌లతో కాలం తెలియకుండా గడుపుతున్న సైఫ్ అలీఖాన్ కెరీర్ తొలినాళ్లలో ఆటుపోట్లతో పాటు అమృతా సింగ్‌తో విడాకుల సమయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2005లో ఓ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ అమృతతో విడాకులు, పిల్లలు సారా, ఇబ్రహిం అలీలను కలుసుకునేందుకు తనను అనుమతించకపోవడంపై మధనపడ్డారు. వీటికితోడు విడాకుల సెటిల్‌మెంట్లు, భరణం చెల్లింపులతో దాదాపు దివాలా పరిస్థితి ఎదుర్కొన్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పిల్లలను కలిసేందుకు తనను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమృతా సింగ్‌కు విడాకుల పరిష్కారంలో భాగంగా రూ 5 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఆమెకు రూ 2.5 కోట్లు చెల్లించానని తన కుమారుడు పెరిగి పెద్దయ్యేవరకూ నెలకు రూ లక్ష చెల్లిస్తానని చెప్పారు. తాను షారుక్ ఖాన్ కాదని, తన వద్ద అంత డబ్బులేదని చెప్పుకొచ్చారు.
తాను డేటింగ్‌లో ఉన్న రోసాతో కలిసి చిన్న డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని చెప్పారు. అలాంటి సైఫ్ ఇప్పుడు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. వరుస హిట్లతో పాటు వెబ్‌సిరీస్ విజయాలతో ఊపుమీదున్నారు. కుమార్తె సారాతో అనుబంధం మెరుగుపడి త్వరలోనే ఆమెను బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment