Pregnancy Bible: This Book Is My Third Child Says Kareena Kapoor - Sakshi
Sakshi News home page

Pregnancy Bible: ‘మూడో బిడ్డను’ పరిచయం చేసిన కరీనా

Published Fri, Jul 9 2021 2:43 PM | Last Updated on Fri, Jul 9 2021 8:01 PM

Pregnancy Bible: This Book Is My Third Child: Kareena Kapoor - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ తన పుస్తకాన్ని లాంచ్‌ చేశారు. తనలోని రచయిత్రిని నిద్ర లేపిన ఆమె ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’  పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఒక​ విధంగా ఇది తన మూడో బిడ్డ లాంటిదని కరీనా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఒకవీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తన ఇద్దరి బిడ్డల్ని కడుపులో మోస్తున్న సమయం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైందన్నారు.

వంటగదిలో అవెన్‌ లోంచి ఈ బుక్‌ హాట్‌ హాట్‌ కాపీని బయటకు తీయడం విశేషం. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి  మానసిక, శారీరక అనుభవాలు, కష్ట నష్టాలను, పలువురి నిపుణులు సలహాలు, సూచనలను ఇందులో పొందుపర్చినట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. అలాగే తన పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు,  ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా పేర్కొన్నారు.

కరీనా కపూర్ 2020లో  తన మొదటి బిడ్డ తైమూర్‌ నాలుగో పుట్టినరోజు సందర్భంగా కరీనా 'ప్రెగ్నెన్సీ బైబిల్'  అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే ఆసక్తికరమైన ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. కాబోయే తల్లులకు సహాయకారిగా ఉండేలా కీలకమైన చిట్కాలను, సమాచారాన్ని ఇందులో రాయబోతున్నట్టు  తెలిపారు.  సైఫ్ అలీ ఖాన్‌, కరీనా దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డ పుట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement