
బాలీవుడ్‌లో ‘దంగల్, చెన్నై ఎక్స్‌ప్రెస్...’ వంటి బడా బడా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పని చేశారు ముఖేష్ చాబ్రా. తాజాగా హాలీవుడ్ హిట్ చిత్రం ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ బాలీవుడ్ రీమేక్ ‘కిజీ అవుర్ మ్యానీ’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో ఈ దర్శకుడి మీద కూడా వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వినిపించాయి. దాంతో దర్శకత్వ బాధ్యతల నుంచి చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో తప్పించింది.
తన మీద వచ్చిన ఆరోపణలను లీగల్‌గా ఎదుర్కొని తన పాపులారిటీని కాపాడుకుంటానని దర్శకుడు చాబ్రా పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రకథానాయిక సంజన సంఘీని హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సెట్లో ఇబ్బందిపెట్టారు అని సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినప్పట్టికీ అవన్నీ అసత్యపు ప్రచారాలంటూ సుశాంత్ కొట్టిపారేశారు.