ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి మీతూ సింగ్ మంగళవారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ మరణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా ఈడీ కార్యాలయానికి చేరుకున్న సుశాంత్ కుటుంబ సభ్యుల్లో ఈమె మొదటి వ్యక్తి. మీతూ సింగ్‌ను ఇప్పటికే ముంబై పోలీసులు అయిదు సార్లు విచారణకు పిలవగా..ఈమె ఇప్పటి వరకు తన వాంగ్మాలాన్ని నమోదు చేసేందుకు హాజరు కాలేదు. మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి, తన సోదరుడికి సంబంధించిన ఆర్థిక లావాదేవాలపై కొన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించేందుకు పిలిచినట్లు ఈడీ వర్గాల నుంచి సమాచారం. (‘సుశాంత్ మరణించే ముందు రోజు మాట్లాడినా’)
కాగా జూన్ 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ముందుగా అతని ఇంటికి చేరుకున్న కొద్ది మందిలో మీతూ సింగ్ కూడా ఉన్నారు. మీతూ సింగ్‌తో పాటు, సుశాంత్ మాజీ మేనేజర్, రియా చక్రవర్తి ప్రస్తుత మేనేజర్ శ్రుతి మోదీ, సుశాంత్ స్నేహితుడు, రూమ్‌మేట్ సిద్దార్థ్ పిథానీని కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక రియా ఆస్తులు, ఆదాయం, ఖర్చులు, వ్యాపార పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆమె ఆస్తుల వివరాలు, సుశాంత్‌తోపాటు ఏర్పాటు చేసిన కంపెనీల వ్యవహారాల వివరాలు సూతం ఈడీ పరిశీలిస్తోంది. (అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం)
మరోవైసు సుశాంత్ తండ్రి కేకే సింగ్ మంగళవారం విచారణ నిమిత్తం సుప్రీంకోర్టులో హాజరయ్యారు. జస్టిస్ హృషికేస్‌తో కూడిన ధర్మాసనం ముందు కేకే సింగ్ మాట్లాడుతూ.. తన కొడుకును కోల్పోవడంతో తన చితికి మంట పెట్టేందుకు కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన కొడుకు ఉరి వేసుకోవడాన్ని ఎవరూ చూడలేదని, తన కుమార్తె చేరుకోగానే సుశాంత్ మంచం మీద పడుకున్నాడని తెలిపారు. దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు జరపాలని కోరాడు. (ట్విన్స్ రాకతో సంతోషం: అంకిత)
కేకే సింగ్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. రియా సుశాంత్‌కు తన తండ్రి, సోదరిని దూరం చేసిందని ఆరోపించారు. అంతేగాక సుశాంత్ మరణించిన సమయంలో అతని మెడపై ఉంది తాడు గుర్తులు కావని బెల్ట్ గుర్తులు అని పేర్కొన్నారు. సుశాంత్‌ను హత్య చేశారని ఆరోపిస్తూ ఈ కేసుపై దర్యాప్తు చేయాలిన అవసరం ఉందని కోర్టులో పేర్కొన్నారు. కాగా పాట్నాలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. రియా అభ్యర్ధనను ఆగష్టు 13న విచారించనుంది. (‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’)
Comments
Please login to add a commentAdd a comment