మరిన్ని కోడ్ వర్డ్‌లు బయటపెట్టిన దీపికా! | Deepika Padukone Reveal More Code Words in NCB Interrogation | Sakshi
Sakshi News home page

మరిన్ని కోడ్ వర్డ్‌లు బయటపెట్టిన దీపికా!

Published Thu, Oct 1 2020 5:02 PM | Last Updated on Thu, Oct 1 2020 7:15 PM

Deepika Padukone Reveal More Code Words in NCB Interrogation - Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత బాలీవుడ్‌ను డ్రగ్స్‌ కేసు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి పలువురి పేర్లను వెలువరించింది. అందులో దీపికా పదుకొనే, ఆమె మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే వారిని ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించగా వారు సరదగా మాట్లాడుకొనే అనేక కోడ్‌ లాంగ్వేజ్‌ల గురించి  వివరించారు. 2017లో వారి వాట్సాప్‌ చాట్‌ గురించి ప్రశ్నించగా వారు వీడ్‌, మాల్‌, డబ్‌ అనే పేర్లతో సిగరెట్లను పిలుచుకుంటామని తెలిపారు. ఇరువురిని వేరువేరుగా ప్రశ్నించగా వారిద్దరూ కూడా  సరైన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇవే కాకుండా ఇంకా ఏం ఏం కోడ్‌ భాషలో మాట్లాడుకుంటారు అని ప్రశ్నించగా తాము పన్నీర్‌, క్విక్కర్‌, మ్యారేజ్‌ అనే కోడ్‌లో మాట్లాడుకుంటామని దీపికా తెలిపింది. పన్నీర్‌ అనే పదాన్ని చాలా సన్నగా ఉండేవారి కోసం ఉపయోగిస్తామని, క్విక్కర్‌ అనే పదాన్ని షార్ట్‌ టర్మ్‌ రిలేషన్‌షిప్‌లో కోసం, మ్యారేజ్‌ అనే పదాన్ని లాంగ్‌టర్మ్‌ రిలేషన్‌షిప్‌లో ఉండే వారి కోసం ఉపయోగిస్తామని దీపికా తెలిపింది. అయితే వారి సమాధానాలతో ఎన్‌సీబీ అధికారులు తృప్తి చెందారని, వారికి త్వరలోనే ఈ డ్రగ్స్‌ కేసు నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయని ఎన్‌సీబీ అధికారి ఒకరు వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ భామలకు క్లీన్‌ చిట్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement