బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
(ఇదీ చదవండి: సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!)
రియాపై నమోదైన సెక్షన్ 27-ఎ అంటే ఇదే
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్‌కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.
అప్పట్లో జరిగింది ఇదీ
2020లో కలకలం రేపిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసు కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్‌సీబీ చార్జీషీట్‌లో పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్‌సీబీ తమ చార్జిషీట్‌లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు నెలరోజుల పాటు జైల్లో ఉన్న రియా బెయిల్‌పై విడుదల అయింది.
(ఇదీ చదవండి: జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్)
Comments
Please login to add a commentAdd a comment