ముంబై: యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) మరణవార్త బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. సుశాంత్ బాంద్రాలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మరణించడం అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా సుశాంత్ 50 'కలల' జాబితా వైరల్ అయ్యింది. దీనిని సుశాంత్ 2019 సెప్టెంబర్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన చేతితో రాసిన కలల పుస్తకాన్ని అభిమానాలతో పంచుకున్నాడు. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు)
విమానం నడపడం నేర్చుకోవడం, ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం, రైలులో యూరప్ ప్రయాణించడం, 100 మంది పిల్లలను ఇస్రో, నాసా వర్క్‌షాపులకు పంపడం ఇలా చాలానే కోరికలను ఆ పుస్తకంలో సుశాంత్ రాసుకొచ్చాడు. ఈ జాబితాలో సుశాంత్ వ్యక్తిగతం.. అతడు ఎలాంటివాడో, పరులకు ఎలాంటి సాయం చేయాలనుకునే వాడో అన్ని కలిసి ఉన్నాయి. వీటితో పాటు, ఆత్మరక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వడం, పిల్లలకు నృత్యం ఎలా చేయాలో నేర్పించడం, ఛాంపియన్‌తో చెస్ ఆడటం, యోగా నేర్చుకోవడం కూడా సుశాంత్ కోరికల జాబితాలో ఉన్నాయి.
సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, అతని మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, అతడు హత్య చేయబడ్డాడని అతని మేనమామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం వచ్చిన సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టు ఈ ఆరోపణలు తప్పని తేల్చింది. అతడు ఆత్మహత్య చేసుకొనే చనిపోయాడని శవ పరీక్ష ఫలితాలలో తేలింది. సుశాంత్ మరణించడంతో అతని బృందం అభిమానులకు కొన్ని విజ్ఞప్తులు చేసింది. "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇకపై మనతో లేరని పంచుకోవడం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇటువంటి బాధాకర సమయంలో మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొంది. ముంబై పోలీసు ప్రతినిధి డిసిపి ప్రణయ్ అశోక్ కూడా ఆదివారం సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించారనే వార్తను ధ్రువీకరించారు.
(ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!)
The heartbreaking end of a dreamer: the 50 dreams of #SushantSinghRajput pic.twitter.com/VPgR8Tr0qJ
— Mahim Pratap Singh (@mayhempsingh) June 14, 2020
Comments
Please login to add a commentAdd a comment