అన్‌ఫాలో స్టార్‌ కిడ్స్‌పై బాబిల్‌ స్పందన.. | Fan Asks Irrfan Khan Son To Unfollow Star kids Babil Reply Wins Internet | Sakshi
Sakshi News home page

అన్‌ఫాలో స్టార్‌ కిడ్స్‌పై బాబిల్‌ స్పందన..

Published Fri, Jun 19 2020 5:47 PM | Last Updated on Fri, Jun 19 2020 6:19 PM

Fan Asks Irrfan Khan Son To Unfollow Star kids Babil Reply Wins Internet - Sakshi

ముంబై : అప్పటి వరకు అడపాదడపా ఉన్న సమస్య ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ఇన్ని రోజులు దీని ప్రస్తావన సినీ పరిశ్రమలో ఉన్పప్పటికీ ఇంత భారీ స్థాయిలో లేదు. అదే నెపోటిజమ్‌(బందుప్రీతి). బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో ఈ వివాదం కాస్తా వాడివేడి చర్చకు దారి తీసింది. కేవలం స్టార్‌ కిడ్‌లు మాత్రమే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారని, ప్రతిభ ఉన్న సామాన్యులకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని వాదన ఎక్కువగా వినబడుతోంది. ఇక బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజమ్‌ కారణంగానే సుశాంత్ నిరాశకు గురయ్యారని, పరిశ్రమలోని రాజకీయాల కారణంగా సినిమాలను కోల్పోయి మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతికి వ్యతిరేకంగా నేడు అనేక మంది నెటిజన్లు గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో కరణ్‌ జోహార్‌ వంటి వారిని సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో అవుతున్నారు. చిత్ర పరిశ్రమలో సుశాంత్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహంతో నెపోటిజానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. (సుశాంత్‌.. మాట నిలబెట్టుకోలేదు క్షమించు)

తాజాగా తాము ఆరాధించే నటీ, నటులను కూడా స్థార్‌ కిడ్‌లను ఫాలో కావొద్దు అంటూ విన్నపిస్తున్నారు. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొడుకు బాబిల్‌ ఖాన్‌ను సుశాంత్‌క్‌ మద్దతుగా చేపడుతున్న పోరాటంలో సహయం చేయాలని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో కోరాడు. అంతేగాక స్టార్‌ కిడ్‌లను అన్‌ఫాలో చేయాలని పేర్కొన్నాడు. దీనిపై బాబిల్‌ స్పందిస్తూ.. ‘భారతీయ సినిమాల్లో నటనలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి(ఇర్ఫాన్‌ ఖాన్‌) కొడుకుగా ఉండటంలో ఎన్ని ఒత్తిడిలు, ఆశయాలు ఉంటాయో నీకు తెలుసా బ్రదర్‌. బంధుప్రీతికి వ్యతిరేకంగా జరుగుతున్న మీ పోరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి’ అని బదులిచ్చారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్‌)

దీనిపై స్పందించిన ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్.. ‘మేము స్టార్‌ కిడ్‌ల సినిమాలను బహిష్కరించలేము. కాబట్టి వారి సోషల్‌ మీడియా అకౌంట్లను అన్‌ఫాలో చేస్తే వారికి ఉన్న ఇన్‌కమ్‌ తగ్గుతుంది. ఇది న్యాయం కోసం జరుగుతున్న పోరాటం’ అని పేర్కొన్నారు. ‘నా నటన, కృషితో మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నానని నేను ఆశిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మీకు ఏదైనా అన్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదు’ అని బాబిల్‌ సమాధానమిచ్చారు. కాగా ప్రస్తుతం బాబిల్‌ ఇచ్చిన రిప్లై నెటిజన్ల మనసు దోచుకుంది. (బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌పై పేరడీ సాంగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement