నేను ఇలా చేయడంతో కొందరు తిట్టుకుంటున్నారు: రష్మిక మందన్న | Rashmika Mandanna Superb Comments On Her Movie Chance In Tollywood | Sakshi
Sakshi News home page

నేను ఇలా చేయడంతో కొందరు నన్ను తిట్టుకుంటున్నారు: రష్మిక మందన్న

Published Thu, Oct 31 2024 8:46 AM | Last Updated on Thu, Oct 31 2024 9:17 AM

Rashmika Mandanna Superb Comments On Her Movie Chance In Tollywood

శాండిల్‌ వుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ వయా బాలీవుడ్‌ అంటూ స్టెప్‌ బై స్టెప్‌ ఎదుగుతూ కథానాయకిగా అగ్రస్థానానికి చేరుకున్న నటి రష్మిక మందన్న. ఇండస్ట్రీలో అదృష్టం అంటే ఈమెదే అనాలి మాతృభాషలో నటించిన కిరాక్‌ పార్టీ మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఆ చిత్రం ఈ అమ్మడిని టాలీవుడ్‌లో అడుగు పెట్టేలా చేసింది. టాలీవుడ్‌ ఈమెను స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. కానీ, కోలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసిన ఈమెకు అంత పేరు తెచ్చి పెట్టలేదు. అయితే బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన బ్యూటీ అక్కడ కూడా క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్నారను. దీంతో దక్షిణాదిలో ఎక్కువగా చిత్రాలు చేసే అవకాశం లేకపోతోంది.

తాజాగా రష్మిక మందన్న నటించిన పుష్పా– 2 త్వరలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానున్నారు. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి రష్మిక మందన్న పేర్కొంటూ తాను తనను ఇతరులతో పోల్చుకోవడానికి ఇష్టపడనని తెలిపారు. దీన్ని తెలిపే విధంగా ఇరీప్లేసబుల్‌ అంటూ తన చేతిపై పచ్చబొట్టును కూడా పొడిపించుకున్నారు . తాను తనలాగే ఉండటానికి ఇష్టపడతానన్నారు. అందువల్లే అభిమానులు తనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని నమ్ముతున్నానన్నారు. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యం ఉన్న మాట వాస్తవమే అన్నారు. 

ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం కొంచెం మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతిభ ఉంటే చాలని అభిమానుల ఆదరణ లభిస్తుందని అన్నారు. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని, అయితే హిందీ తదితర ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని అన్నారు. అందువల్ల తెలుగు సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, కొందరైతే తనను తిట్టుకుంటున్నారని అన్నారు. 

అయితే అదంతా వారికి తనపై ఉన్న అభిమానమే కారణమని గ్రహించగలనని పేర్కొన్నారు. అదేవిధంగా హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదని చాలామంది అడుగుతున్నారని, అలాంటి కథాచిత్రాల్లో నటించాలని ఏ నటి అయినా కోరుకుంటారని, తాను అందుకు అతీతం కాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement