రష్మిక కెరీర్‌లోనే 2024 గుర్తుండిపోయే ఏడాది. ఇప్పుడు దీనికి సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయింది నేషనల్ క్రష్. ఈ ఏడాది ఆమె 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. శ్రీవల్లిగా రష్మిక పెర్‌ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.
(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక)
ప్రస్తుతం రష్మిక.. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో బిజీగా ఉంది. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ 'సికందర్' మూవీలో ఈమెనే హీరోయిన్. 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక ఫుల్ హ్యాపీ. వచ్చే ఏడాదిలోనూ గర్ల్ ఫ్రెండ్, కుబేర, సికందర్ తదితర చిత్రాలతో అలరించేందుకు రష్మిక రెడీ అయిపోయిందనే చెప్పాలి.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment