
నాటు నాటు ఆస్కార్ గెలిచిన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన రామ్ చరణ్ నేరుగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ మారిన చరణ్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ వేదికలపై తనదైన స్పీచ్‌లతో అదరగొట్టాడు. అంతేకాదు ప్రతిష్టాత్మక అవార్డు హెచ్‌సీఏ(హాలీవుడ్ క్రిటిక్ అసోసియేష్ అవార్డును) ప్రజెంటర్‌గా విశ్వవేదికపై మెరిసాడు. అలా ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
చదవండి: ‘రానా నాయుడు’ సిరీస్‌పై సీనియర్ నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా చరణ్‌కు నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్ బంధుప్రీతిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మా నాన్న వాళ్లే ఇక్కడకు వచ్చాను.. కానీ ఆ తర్వాత తనకు తానుగా ముందుకు సాగాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నిజానికి ఈ నెపోటిజం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ మధ్య కాలంతో దీని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఈ అంశాన్ని ఎక్కువ చర్చిస్తున్నారు’ అని అన్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘అవును నేను మా నాన్న వల్లే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు నటన అంట ఇష్టం. చిన్నప్పటి నుంచి పరిశ్రమలోనే పెరిగాను.
చదవండి: పీకల్లోతు కష్టాల్లో మణిరత్నం... పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ డౌటే!
సినిమాలు చేయాలనే కలతోనే నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నా. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. 14 ఏళ్లు పరిశ్రమలో నిలబడిగలిగాను. స్టార్ హీరో కొడుకుగా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ నాకు నేనుగా ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకురావుడం కష్టం. ప్రతిభ లేకుంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ‘‘సినిమాలోకి వస్తానన్నప్పుడు మా నాన్న నాకు ఒకటి చెప్పారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. నీ కోసం పనిచేసే వాళ్లను జాగ్రత్తగా చూసుకో చాలు’ అన్నారు. ఆయన మాటలను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా’’ అంటూ చరణ్ తనదైన శైలిలో నెపోటిజంపై వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే తనకు ఇష్టమని చెప్పమని, ఆయనకు వీరాభిమానిని అని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment