
అటు నటిగానూ.. ఇటు నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తనని తాను అండర్‌డాగ్ అనడమేంటని ఆశ్చర్యపోకండి..నెపోటిజమ్(బంధుప్రీతి) ప్రభావం ఔట్‌సైడర్స్‌పై ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.
అనుష్క శర్మ ప్రస్తుతం సూయి దాగా మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘ నాణేనికి రెండు వైపులు ఉంటాయి కదా. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలా రెండు కోణాలు ఉంటాయి. నెపోటిజమ్ విషయంలో స్టార్ కిడ్స్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అవును ఇండస్ట్రీ ఔట్‌సైడర్స్‌గా మేము అండర్‌డాగ్సే. కానీ స్టార్ కిడ్స్‌పై ఉన్నంత ఒత్తిడి మాపై ఉండదు. అంచనాలు కూడా ఉండవు. ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే చాలు ఇక్కడ నిలదొక్కుకోవడం సులభమే. కానీ ఆ ఒక్క అవకాశం వచ్చేదాకా ఓపికగా వేచి చూడాలి. స్టార్ కిడ్ అయినా కాకున్నా ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. నా వరకైతే నెపోటిజమ్ గురించి మాట్లాడమంటే సమయాన్ని వృథా చేసుకోవడంగానే భావిస్తాను’ అంటూ నెపోటిజమ్‌పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అనుష్క శర్మ.
కాగా ఆర్మీ కుటుంబంలో జన్మించిన అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. గతేడాది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లాడిన ఈ భామ అటు పర్సనల్ లైఫ్‌ను ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం షారూఖ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జీరో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment