ఒకే చెట్టుకు ఇద్దరు స్నేహితుల ఉరి | Friends Commits Suicide in Karnataka | Sakshi

ఒకే చెట్టుకు ఇద్దరు స్నేహితుల ఉరి

Dec 27 2019 8:13 AM | Updated on Dec 27 2019 8:13 AM

Friends Commits Suicide in Karnataka - Sakshi

చెట్టుకు వేలాడుతున్న యువకుల మృతదేహాలు

కర్ణాటక, ముళబాగిలు: ఇళ్లనుంచి బయటకు వచ్చిన ఇద్దరు స్నేహితులు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులై కనిపించారు. ఈ ఘటన తాలూకాలోని అణ్ణిహళ్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం వెలుగుచూసింది.  గ్రామానికి చెందినప్రవీణ్‌  కుమార్‌ (19), కప్పల మడుగు గ్రామానికి చెందిన వీ శ్రీనాథ్‌(24)లు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం తమ తమ గ్రామాలనుంచి బైక్‌ల్లో బయటకు వచ్చారు. తిరిగి ఇళ్లకు చేరలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న  స్థితిలో విగతజీవులుగా కనిపించారు.

మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంగలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా యువకులను హత్య చేసి చెట్టుకు ఉరివేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కార్తీక్‌రెడ్డి పరిశీలించారు. నిపుణులు వేలిముద్రలు సేకరించారు. జాగీలం సహాయంతో  పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.  వీరిద్దరిదీ ఆత్మహత్య? లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement