ఇద్దరు ప్రయాణికులు ఒక్క ఫ్లైట్ జర్నీ చేయకుండా ఏకంగా 27 దేశాలు చుట్టొచ్చారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కార్బన్ ఉద్గారాలు లేకుండా ప్రయాణించి చూపారు. డబ్బుని కూడా ఆది చేశారు. అస్సలు ఫ్లైట్ జర్నీ చెయ్యకుండా అన్ని దేశాలు చుట్టిరావడం సాధ్యమేనా..?.అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా అన్ని దేశాలు ప్రయాణించగలిగారో చూద్దామా..!
ఇటలీకి చెందిన టోమ్మాసో ఫరీనామ్, స్పెయిన్‌కి చెందని అడ్రియన్ లాపుఎంటే అనే ఇద్దరు గత వేసవిలో తమ అడ్వెంచర్‌ని ప్రారంభించారు. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వృక్ష సంపద, జంతువులతో సహవాసం చేసే ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతోనే తాము ఈ సాహసం చేసినట్లు చెప్పారు ఇద్దరు. తమ జర్నీలో ఎక్కడ కార్బన్ ఉద్గారాలకు తావివ్వకూడదనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించారు.
తాము సోషల్ మీడియాలో బోట్ హిచ్‌హైకర్స్ అనే రైడ్‌ని సంప్రదించి ప్రయాణించినట్లు తెలిపారు. ఇలాంటి జర్నీ చేసిన అనుభవం లేకపోయినా ధైర్యం చేసి మరీ ఇలా సెయిలింగ్ బోట్‌లో అట్లాంటిక్ మీదుగా ప్రయాణించినట్లు వివరించారు. ఆ తర్వాత మోనోహాల్ బోట్‌లో పసిఫిక్ మీదుగా ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ పనామా వరకు వెళ్లొచ్చినట్లు తెలిపారు. ఇలా తాము జర్నీ చేసినట్లు కుటుంబసభ్యులు, బంధువులకు చెబితే ఒక్కసారిగా వారంతా కంగుతిన్నారని చెప్పుకొచ్చారు ఈ ఇద్దరు మిత్రులు.
అంతేగాదు గల్ఫ్ ఆఫ్ పనామాలో సముద్రంలోని భయంకరమైన అలలతో చేసిన జర్నీఓ పీడకలని చెప్పారు. అయినప్పటికీ తాము తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ జర్నీ చేయాలని అనుకోలేదని ధైర్యంగా చెప్పారు. ఇలా విమానంలో ప్రయాణించకుండా పర్యావరణానికి సహాయం చేయడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేయడం విశేషం. ఒక్కోక్కరికి ఇలా 27 దేశాలు చుట్టి రావడానికి కేవలం రూ. 6 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యింది. ఈ ఇద్దరు మిత్రులు 'ప్రాజెక్ట్ కునే'లో భాగంగా తమ కథనాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవడంతో నెట్టింట ఈ విషంయ తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఛారిటీ కోసం ఇంగ్లీష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!)
Comments
Please login to add a commentAdd a comment