
మృతుడు రజినీకాంత్ ఇంటివద్ద విషాదంలో బంధువులు
కరీంనగర్, మంథని: ముగ్గురివీ పేద కుటుంబాలే.. ముగ్గురూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. పక్కపక్క గ్రామాల్లో ఉన్నప్పటికీ కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేయగా, ఒకరు ఎంబీఏ చదివాడు. జీవితంలో స్థిరపడిన తర్వాతే ముగ్గురూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి వేటలో పడ్డారు. అయితే లాక్‌డౌన్‌తో వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత అండగా ఉండాలనుకున్నారు. నెల క్రితం ముగ్గురూ ఓ ఇసుక క్వారీలో పనికి కుదిరారు. అక్కడే ఉంటూ విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇసుక క్వారీల్లో పని ఆగిపోయింది. నెల రోజుల తర్వాత ద్విచక్రవాహనంపై ఆనందంగా ఇంటికి బయల్దేరిన స్నేహితులను మృత్యువు లారీ రూపంలో కబళించింది. ప్రాణాలను తీయగలిగింది కానీ.. స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. మంథని సమీపంలో జరిగిన ఈ ఘటన జూలపల్లి మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిలో మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్‌పల్లి శివారులో సోమవారం లారీ ఢీకొని ముగ్గురూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లి మండలం అబ్బాపూర్ చెందిన రజనీకాంత్(26), మిట్ట మధుకర్(26), , బాలరాజుపల్లికి అడప సురేశ్(24)లు ముగ్గురు విద్యావంతులు. లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా నెల కిత్రం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీలో సూపర్‌వైజర్లుగా పనికి కుదిరారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్వారీలో పని ఆగిపోగా సోమవారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ఇళ్లకు బయలుదేరారు. మంథని మున్సిపాలిటీ పరిధి కూచిరాజ్‌పల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొ నడంతో రజనీకాంత్, మధుకర్ అక్కడికక్కడే మృతిచెందారు. సురేశ్‌ను మంథని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రజనీకాంత్, మధుకర్ మృతదేహా లు చిందరవందరగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు బయటపడ్డాయి. రోడ్డంతా రక్తసిక్తమైంది. లారీ వేగంగా ద్వి చక్రవాహనాన్ని ఢీకొనగా భారీ శబ్దం రావడంతో సమీపంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న వారు ప్రమాద సమాచారాన్ని పోలీసులు చేరవేశారు. లారీ రోడ్డు దిగి పత్తి చేసులోకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. మ ంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్‌యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ మృతదేహాలను అంబులెన్స్›లో ఎక్కించి పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మూడు కుటుంబాల్లో విషాదం
ఎలిగేడు(పెద్దపల్లి): మంథని సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు నిరుపేద కు టుంబాలకు చెందినవారే. వీరిలో ఇద్దరిది అబ్బాపూర్ కాగా మరొకరిది బాల్‌రాజ్‌పల్లి. ముగ్గురు యువకుల మృతితో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కుటుంబ నేపథ్యం..
మృతుల్లో అబ్బాపూర్‌కు చెందిన చొప్పరి రజినీకాంత్(26) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి రాజేశ్వరి కూలీపని, తండ్రి కొమురయ్య హమాలీ పని చేస్తూ కుమారుడిని చ దివించారు. అదే గ్రామానికి చెందిన మిట్ట మధుకర్(26)ఎంబీఏ చదివాడు. తల్లి ఆరవ్వ కూలీ పనిచేస్తుతండగా తండ్రి మల్లయ్య హమాలీ పని చేస్తూ ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించారు. అడప సురేశ్(24)డిగ్రీ చదివాడు. తల్లి లక్ష్మి, తండ్రి లచ్చయ్య కూలిపని చేస్తూ కుమారున్ని చదివించారు. కుటుంబా నికి భారం కాకూడదని ఎంతో కొంత ఆసరాగా ఉండాలని ముగ్గురు యువకులు ఇసుక క్వారీలో పనికి కుది రారు. పనులు సాగక ఇంటికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment