రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కరీంనగర్: రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని గంగానగర్ లో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లింగయ్య (55) , కొమరయ్య(54) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కొమరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.