ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై: ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడి కిరాతకం నామక్కల్‌లో వెలుగు చూసింది. బీహార్‌కు చెందిన ఓ యువతి నామక్కల్ వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్క డే పనిచేస్తున్న బాల్ రాజ్‌తో ఈమె పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయ మాటలు చెప్పి తన ఇంటికి బాల్‌రాజ్ తీసుకెళ్లాడు.
చదవండి: (Lovers Commit Suicide: ప్రేమ జంట ఆత్మహత్య)
కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే యత్నం చేసిన ఆమె మీద బాల్‌రాజ్ లైంగిక దాడి చేశాడు. అంతేకాదు, మిత్రులు ప్రదీప్, మనోజ్‌కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో స్పృహ తప్పింది. ఆందోళనతో ఆ ముగ్గురు ఉడాయించారు. అర్ధరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్‌కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఆ ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment