Prahlada
-
అతడు సర్వాంతర్యామి
‘‘నమో హిరణ్యాయ నమః’’ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు.‘‘రమ్ము నారదా’’ అంటూ మహర్షికి స్వాగతం పలికాడు హిరణ్యకశిపుడు.‘‘దానవేంద్రులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు.మరలా ఏదైనా దండయాత్రకు ప్రయత్నమా?’’ అడిగాడు నారదుడు.‘‘ముల్లోకములు జయించినవాడికా!’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఇక తాను జయించవలసింది ఏమీ లేదనే భావన...ఆ జవాబులో ధ్వనించింది.‘‘మరి దీర్ఘాలోచనకు కారణం?’’ అడిగాడు నారదుడు.‘‘ప్రహ్లాదుడు’’ అన్నాడు హిరణ్యకశిపుడు విచారంగా.ప్రహ్లాదుడిని చూస్తూ...‘‘బుద్ధిమంతుడు’’ మెచ్చుకోలుగా అన్నాడు నారదుడు.‘‘మంద బుద్ధిమంతుడు’’ అన్నాడు విసుగ్గా హిరణ్యకశిపుడు.‘‘అదేమి దానవేంద్రా!’’ ఆశ్చర్యపోయాడు నారదుడు.‘‘ఇతనికి ఏదో జాడ్యం ఉన్నది. ఉలకడు. పలకడు. ఆకలి అనడు. దప్పి అనడు. తోటివాళ్లతో ఆడడు, పాడడు. అసలు తాను దానవ సార్వభౌముని పుత్రుడననే అహంకారం, దర్పం కానరాదు...’’ అని బాధగా చెప్పుకుపోతున్నాడు హిరణ్యకశిపుడు.(స్నేహితులు కూడా ప్రహ్లాదుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు....అటువంటి తండ్రికి ఇటువంటి కొడుకా! అని ఈసడించుకుంటున్నారు)‘‘ఒంటరిగా కూర్చొని తనలో తాను పిచ్చివాని వలే నవ్వుచుండును’’ అన్నది లీలావతి తన ముద్దుల కుమారుడిని గురించి.‘‘అవును. లీలావతి జ్ఞాపకమున్నదా? పసితనములో ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా ఉండేదిగానీ...’’ అని నారదుడు అన్నాడో లేదో హిరణ్యకశిపుడు అడ్డుపడ్డాడు.‘‘ఓహో ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమవాతావరణ ప్రభావము. గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాకాదులచే పోషించిన పుత్రుడు ఇట్లుగాక మరెట్లుండును’’ అన్నాడు హిరణ్యకశిపుడు వ్యంగ్యంగా.‘‘స్వామీ! చిరంజీవి ఇంకను పసివాడు. అతడిని ఉద్ధరించే మార్గం ఆలోచించండి’’ అని అభ్యర్థించింది లీలావతి.‘‘దీనికి ఒక్కటే మార్గం’’ అన్నాడు హిరణ్యకశిపుడు. ఆ తరువాత కొడుకును దగ్గరగా తీసుకొని...‘‘నాయనా! నీవు దానవకులదీపం. భావి సార్వభౌముడవు. సకలశాస్త్ర పారంగతుడవై, నీతికోవిదుడవై ముల్లోకములను పరిపాలించవలెను. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం’’ అన్నాడు.‘‘అలాగే తండ్రి! శ్రద్ధగా చదువుకొనెదను’’ వినయంగా సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు.‘‘సంతోషం’’ అన్నాడు హిరణ్యకశిపుడు.విద్య కోసం ప్రహ్లాదుడిని చండమార్కుల దగ్గరికి పంపారు.చండామార్కుల ఆశ్రమంలో.... ‘‘హరిభక్తి లేని వాడు పశువు కన్నా హీనం కదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.ఆ బాలుని కళ్లలో తెలియని దివ్యత్వం! ‘‘అయితే మల్లోకాధిపతి అయిన నీ తండ్రి, నీకు గురువులమైన మేము, ఈ దానవలోకం అంతా పశువులనా నువ్వు అనునది!’’ ఆందోళనస్వరంతో అడిగారు చండామార్కులు.‘‘హరి హరి గురుదూషణ పాపంకదా’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘పాపం పాపం అంటూనే గురువులకు పంగనామం పెడుతున్నావు’’ అని వెటకరించారు పెద్ద గురువు. ‘‘లేదు గురువర్యా! నా ప్రార్థన ఆలకించండి. మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి’’ తన్మయంగా అన్నాడు ప్రహ్లాదుడు.ఎంత చెప్పినా శిష్యుడుగారు తమ మాటలు వినరని, పైగా తమకే పాఠాలు చెబుతాడనే విషయం చండామార్కులకు ఆ చిరుసమయంలో క్షుణ్ణంగా అర్థమైంది.ఇక పెద్దగురువు గారిలో వణుకు మొదలైంది.‘‘తమ్ముడూ...నా వొడలంతయూ కంపనముగా యున్నది. నదికి పోయి స్నానం చేసి వచ్చెదను నాయనా!’’ అన్నారు పెద్ద గురువుగారు.‘అగ్రజా! నా వొడలు నీ కంటే కంపనముగా యున్నవి. నేనూ వచ్చెదను’’ అని అన్నగారి వణుకుతో తన వణుకును జత చేశాడు.గురువులు అలా వెళ్లారో లేదో విద్యార్థులు హుషారుగా ఆటలు మొదలు పెట్టారు.వారి ఆటలను చూసి...‘‘మిత్రులారా! శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థం చేయుట? అన్ని జన్మలలోనూ మానవజన్మ దుర్లభం. ఈ జీవితం నూరు సంవత్సరాలకు పరిమితం. ఈ నూరు సంవత్సరాలలో సగం రాత్రి రూపమున, నిద్ర రూపమున నిరర్థకం అగును. మిగిలిన యాభై ఏండ్లలో ఇరవై ఏండ్లు పోగా చివరికి మిగిలినముప్పది ఏండ్లలో సంసార లంపటమున చిక్కుకొని మానవుడు కామ క్రోధాది అరిషడ్వర్గములచే పీడించబడును. కావున...కాలం వ్యర్థం చేయక హరిభజనలో మోక్షం పొందుట ఉత్తమం, హరినామంకంటే రుచి అయినది లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘లేకేం...నరమాంసం’’ అన్నాడు ఒక విద్యార్థి.మిగిలిన వాళ్లు నవ్వారు.‘‘హరి అంటే ఎవరు?’’ అని ప్రహ్లాదుడిని అడిగాడు ఒకడు. ‘‘నారాయణుడు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘అతనికి రెండు పేర్లా?’’ అడిగాడు ఒకడు.‘‘రెండేమిటి! అతనికి అనంతకోటి నామాలు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘ఎందుకు?’’‘‘ఒకటైతే వాళ్ల అమ్మ మరిచిపోతుందని’’ వెటకారంగా అన్నాడు ఒకడు.‘‘అతని అమ్మ పేరేమిటి?’’‘‘అతనికి అమ్మ లేదు’’‘‘మరి నాన్నో?’’‘నాన్నా లేడు’’‘వాడెవడో విచిత్రమైన వాడునన్నట్లున్నాడే...ఏ ఉరు ఎక్కడ ఉంటాడు?’’ ఆసక్తిగా అడిగాడుఒకడు. ‘‘అతడు సర్వాంతర్యామి. అతను లేని చోటు లేదు’’ అన్నాడు ప్రహ్లాదుడు.‘‘మరి ఎలా పుట్టాడు?’’‘‘అతనికి పుట్టుకయే లేదు’’‘‘మరి అతడిని చూసుట ఎట్లా?’’‘‘భక్తితోధ్యానించుటయే’’‘‘ఓంనమోనారాయణ....ఓం నమోనారాయణ’’పై సన్నివేశాలు ఏ సినిమాలోనివి? -
ప్రహ్లాదుడి సచ్ఛీలత
నరసింహావతారం దాల్చిన శ్రీహరి హిరణ్యకశిపుడిని వధించాక, ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం లభించింది. శ్రీహరికి పరమభక్తుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన ప్రహ్లాదుడి పరిపాలనలో ముల్లోకాలూ అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో తులతూగుతూ ఉండేవి. దేవ దానవ మానవులందరూ ప్రహ్లాదుడి సుగుణాలను వేనోళ్ల కీర్తించసాగారు. ప్రహ్లాదుడి ప్రాభవం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుండటంతో స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన దేవేంద్రుడికి బెంగ పట్టుకుంది. ఇక తనకు ఎన్నటికీ స్వర్గాధిపత్యం తిరిగి దక్కదేమోనన్నదే అతడి బెంగ. ఇదివరకు అతడు కొన్నిసార్లు రాక్షసుల చేతిలో దెబ్బతిని, స్వర్గాధిపత్యాన్ని వదులుకోవాల్సి వచ్చినా, హరిహరులలో ఎవరో ఒకరు అతడి రక్షణకు వచ్చి, దుష్టులైన ఆ రాక్షసులను సంహరించడంతో తిరిగి స్వర్గాధిపత్యం పొందగలిగాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే అయినా, అతడు దుష్టుడు కాడు. సకల సద్గుణ సంపన్నుడు, పరమ భాగవతోత్తముడు. అతడికి అండగా సాక్షాత్తు శ్రీహరి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కేదెలా? దీనికి తరుణోపాయం చెప్పాలంటూ ఇంద్రుడు దేవగురువు బృహస్పతి వద్దకు వెళ్లాడు. ‘ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం ఎలా లభించింది? అతడి నుంచి నాకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కుతుందా? ముల్లోకాలూ అతడినే పొగుడుతున్నాయి? కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.‘నాయనా! ఇంద్రా! ప్రహ్లాదుడు ఉత్తములలోకెల్లా ఉత్తముడు. ఉత్తమోత్తమ జ్ఞాన సంపన్నుడు. ఉత్తమోత్తమ జ్ఞానసంపద కారణంగానే అతడికి త్రిలోకాధిపత్యం లభించింది.’ అని బృహస్పతి బదులిచ్చాడు. ‘ఉత్తమోత్తమ జ్ఞానం ఏమిటి? దయచేసి నాకు బోధించండి’ అని అర్థించాడు ఇంద్రుడు. ‘మోక్ష సాధనకు పనికి వచ్చేదే ఉత్తమోత్తమ జ్ఞానం. అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లు. అతడే నీకు ఆ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని బోధించగలడు’ అని సూచించాడు బృహస్పతి.బృహస్పతి సలహాపై ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. మోక్షాన్ని పొందగల ఉత్తమోత్తమ జ్ఞానాన్ని తనకు ప్రసాదించమని వేడుకున్నాడు. సరేనని బోధించాడు శుక్రాచార్యుడు. అప్పటికీ సంతృప్తి చెందని ఇంద్రుడు ‘ఆచార్యా! ఇంతకు మించినదేదైనా ఉందా? ఉంటే ఎక్కడ దొరుకుతుంది?’ అని అడిగాడు. ‘ముల్లోకాలలోనూ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని మించినది కూడా ఉంది. అదే సచ్ఛీలత. సచ్ఛీలత కావాలంటే ప్రహ్లాదుడి వద్దకు వెళ్లు.’ అని సూచించాడు శుక్రాచార్యుడు.బ్రాహ్మణ వేషం ధరించి, ప్రహ్లాదుడి వద్దకు చేరుకున్నాడు ఇంద్రుడు. తనకు జ్ఞానబోధ చేయమని అర్థించాడు. ‘నిత్యం రాజ్య వ్యవహారాలతో తలమునకలై ఉంటాను. నీకు జ్ఞానబోధ ఎప్పుడు చేయగలను? ఎవరైనా మంచి ఆచార్యుడిని చూసుకో’ అని సలహా ఇచ్చాడు ప్రహ్లాదుడు. అయినా పట్టు వీడలేదు ఇంద్రుడు. వీలున్నప్పుడే బోధించమన్నాడు. అంతవరకు శుశ్రూష చేసుకుంటూ ఉంటానన్నాడు. సరేనన్నాడు ప్రహ్లాదుడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంద్రుడికి జ్ఞానబోధ చేయసాగాడు. ఇంద్రుడు కూడా వినయ విధేయతలతో ప్రహ్లాదుడికి శుశ్రూష చేయసాగాడు. ఇంద్రుడి శుశ్రూషకు ప్రసన్నుడైన ప్రహ్లాదుడు ‘ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు? ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు ఇలా బదులిచ్చాడు. ‘ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. నా గురువులను ఇప్పటికీ సేవించుకుంటాను. ముల్లోకాలనూ ఏలుతున్నా ఇదంతా నా ఘనత అని భావించను. నా సచ్ఛీలతే నాకు శ్రీరామరక్షగా ఉంటోంది’ అని బదులిచ్చాడు. ‘అయితే, నీ సచ్ఛీలతను నాకు దానమివ్వు’ అని కోరాడు ఇంద్రుడు. అప్పుడు గ్రహించాడు ప్రహ్లాదుడు... తన ఎదుట ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడేనని. అయినా ఏమాత్రం సంకోచించలేదు. తన సచ్ఛీలతను అతడికి దానమిచ్చేశాడు. ప్రహ్లాదుడి నుంచి ఒక తేజస్సు వెలువడింది. ‘నేను నీ సచ్ఛీలతను. నీవు నన్ను దానం ఇచ్చేశావు. అందుకే నిన్ను వీడి వెళుతున్నా’ అంటూ ఇంద్రుడిలోకి ప్రవేశించింది. ఆ వెంటనే అష్టలక్ష్ములు కూడా... సచ్ఛీలత లేనందున ఇకపై నీతో ఉండలేమంటూ ఇంద్రుడి శరీరంలోకి ప్రవేశించారు. సచ్ఛీలతతో పాటు తన ఐశ్వర్యం, రాజ్యసంపద సమస్తం తనను వీడిపోయినా ప్రహ్లాదుడు దిగులు చెందలేదు. ప్రశాంత చిత్తంతో నారాయణ మంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరకు శ్రీహరి అనుగ్రహంతో మోక్షాన్ని పొందాడు. ‘రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు. ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు బదులిచ్చాడు. -
భక్తి ప్రపంచానికి బాలకులే పాలకులు
బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. బాలల దినోత్సవం నాడు అటువంటి బాలురను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మన పిల్లలకు వారి చరిత్రలను చెప్పాలి. వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే సభక్తికంగా తీర్చిదిద్దాలి. మొక్కై వంగనిది మానై వంగునా! అన్నది అనాదిగా వస్తున్న పెద్దలమాట. ఆ మాటను ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో ఉపయోగిస్తారు. ఎవరికి దైవం మీద భక్తి ఉంటుందో వారికి పాపభీతి ఉంటుంది. పాపభీతి ఉన్నవాడు తప్పుడు పనులు చేయడానికి సాహసింపడు. తప్పు చేయకపోవడమే క్రమశిక్షణ. ఆ లక్షణం చిన్నప్పటి నుండీ అభ్యాసంలో ఉండాలి. ప్రహ్లాదుడు పురాణ చరిత్రలోకి వెడితే ముక్కుపచ్చలారని కొందరు బాలకులు అసాధారణ భక్తిభావంతో పెద్దలకు కనువిప్పు కలిగించినవారు, భగవంతుని ప్రత్యక్షం చేసికొని ప్రపంచాన్ని విస్మయపరచినవారు కనిపిస్తారు. వారి పేర్లు లోకంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటివారిలో ప్రథమగణ్యుడు ప్రహ్లాదుడు. అతనిని బాలభక్తుడని అనడానికి కూడా వీలు కాదు. శిశుభక్తుడు. ఇంకా చెప్పాలంటే ఆగర్భభక్తుడు. కడుపులో ఉన్నప్పుడే ఇంద్రుడు అతని తల్లిని బంధించి తీసుకుపోతుంటే నారదుడు వారించి, వెనుకకు తీసికొనివచ్చి, గర్భస్థ శిశువునకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. నాటి నుండి, అంటే ఇంకా భూమి మీద పడకుండగానే నారాయణ భక్తిలో మునిగిపోయాడు ప్రహ్లాదుడు. వాని తండ్రి హిరణ్యకశిపుని నిరంకుశత్వానికి శిరసు వంచి, ప్రపంచమంతా ఆ రాజునే దేవునిగా భావిస్తుంటే, పాలబుగ్గల ప్రహ్లాదుడు మాత్రం తండ్రిని ఎదిరించి, మనందరికీ అధినాథుడైన నారాయణుడే దైవమని నొక్కి వక్కాణించాడు. తనకే ఎదురు చెప్పిన ప్రహ్లాదుణ్ణి, కొడుకు అని కూడా చూడకుండా ఏనుగులతో తొక్కించాడు, గదలతో మోదించాడు, పాములతో కరిపించాడు, విషాన్ని తాగించాడు, మంటలోకి తోయించాడు, కొండలపై నుంచి లోయలలోనికి గెంటించాడు, సముద్రంలో పడవేయించాడు. ఎన్ని చేసినా కేవలం నారాయణ నామస్మరణంతో బ్రతికి వచ్చిన కుమారుని చూచి విసిగి చివరకు నీ నారాయణుడు ఎక్కడున్నాడో చెప్పమంటాడు. ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే’’ అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపించమన్నాడు తండ్రి. చూడమన్నాడు కుమారుడు. వెంటనే తన చెంతనున్న బలమైన గదతో ఆ స్తంభాన్ని బద్దలుకొడితే అందులో నుండి శ్రీహరి నరసింహరూపంలో బయటకు వచ్చి లోకకంటకుడైన హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని రక్షించాడు. కన్నతండ్రే పిల్లలకు చెడును నూరిపోస్తుంటే, తన కళ్ళ ఎదుటే అధర్మాన్ని ఆచరిస్తుంటే, ఆచరించమని ప్రోత్సహిస్తుంటే అటువంటి తండ్రిని ఎదిరించడమే ధర్మమని లోకానికి తెలియజేసిన మొదటివ్యక్తి, అప్పటికి కేవలం ఐదేళ్ళ వయసున్న బాలుడు ప్రహ్లాదుడు. ధ్రువుడు ధ్రువుడనే బాలకుడు రాజకుమారుడు. సవతి తల్లి పెత్తనం ముందు తన తల్లిమాట నెగ్గక, తండ్రి ప్రేమకు నోచుకోలేక పోయాడు. కనీసం సవతి తమ్మునితో బాటుగా నాన్న ఒడిలో కూర్చోడానికి కూడా ఆ సవతి తల్లి ఒప్పుకోలేదు. నొచ్చుకున్నాడు. తన తల్లి దగ్గర తన బాధను చెప్పుకొన్నాడు. ఆమె ఓదారుస్తూ నాన్నగారి ఒడిలో కూర్చోవాలని ఎందుకు కోరుకుంటున్నావు. భక్తితో శ్రీహరిని సేవించు. ఆయన ఒడిలోనే కూర్చోవచ్చు అని మాటవరుసకు అంది. అంతే! మనసులో ఏదో ప్రేరణ కలిగింది. వెంటనే ఇల్లు, వాకిలి విడిచిపెట్టి అడవికి పోయి. నారయణుని కోసం తీవ్రమైన తపస్సు చేసి, చివరకు ఆ స్వామిని ప్రత్యక్షం చేసికొన్నాడు. ఏం కావాలని అడిగాడు. అప్పుడు ధ్రువుడు, భోగభాగ్యాలను కోరుకోకుండా మోక్షాన్ని ప్రసాదించమని కోరితే నారాయణుడే ఆశ్చర్యపోయాడు. అప్పుడే కాదు, పెద్దవాడివై, రాజ్యాన్ని ప్రజానురంజకంగా పాలించి, ఎన్నో పుణ్యకార్యాలు చేసి, ఆ తరువాత నక్షత్రంగా మారి లోకానికి వెలుగిస్తావని వరమిచ్చాడు శ్రీహరి. అంతే! జన్మాంతమందు అలాగే ధ్రువనక్షత్రంగా మారి ఈనాటికీ అందరి నమస్కారాలు అందుకొంటున్నాడు ఆనాటి పసిబాలుడు ధ్రువుడు. మార్కండేయుడు సంతానం కోసం తపస్సు చేసిన మృకండు మహర్షికి శివుడు ప్రత్యక్షమై అల్పాయువైన గుణవంతుడు కావాలా? దీర్ఘాయువైన మూర్ఖుడు కావాలా? అని అడిగితే అల్పాయువైనా గుణవంతుడే కావాలని అర్థించాడు. అలా జన్మించినవాడు మార్కండేయుడు. ఎలాగూ ఎంతోకాలం బతకనివాడికి నామకరణం కూడానా అని మానుకొన్నాడు తండ్రి. మృకండుని కుమారుడు కనుక మార్కండేయుడని లోకం పిలువసాగింది. చివరకు అదే వాని శాశ్వతనామధేయం అయిపోయింది. చిన్ననాటినుండీ శివారాధనలో మునిగిపోయాడా బాలుడు. శివధ్యానం, శివనామస్మరణ తప్ప వేరే ప్రపంచం లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అందరూ వాని అచంచల భక్తిని చూచి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. అలా పదునారేండ్లు గడిచాయి. ఆయువు తీరే గడియ రానే వచ్చింది. ఆ సమయంలో కూడా మార్కండేయుడు శివాలయంలోనే ఉన్నాడు. పసిప్రాయంనుండే శివారాధన తత్పరుడైన వాని ప్రాణాలను హరించడం కింకరులకు సాధ్యం కాదని యముడే స్వయంగా బయలుదేరాడు. బాలకుడు తన తపోమహిమ వలన యముని కనులారా చూడగలిగాడు. కొంత భయం వేసింది. బతుకుమీద కోరికతో కాకుండా తగినంత తపస్సు చేస్తేనేగాని మోక్షం రాదని, తపస్సు చేయాలంటే తాను ఇంకా కొంతకాలం బతికి ఉండాలని భావించి, యముని బారి నుండి కాపాడమని మృత్యుంజయుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, ఆ శివలింగాన్నే కౌగలించుకొని ఉండిపోయాడు. ‘‘చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః’’ అంటూ స్తోత్రం చేశాడు. అయినా బలవంతంగా వాని ప్రాణాలను హరించేందుకు ప్రయత్నించిన యమధర్మరాజును శివుడు ప్రత్యక్షమై నిలువరించాడు. మార్కండేయుని చిరంజీవిని చేశాడు. అలా బాల్యంలోనే పరమేశ్వరుని ప్రత్యక్షం చేసికొని మృత్యువునే ఎదిరించి అల్పాయువును చిరాయువుగా మార్చుకొన్న మహనీయుడు మార్కండేయుడు. సిరియాళుడు పరమశివభక్తులైన దంపతులను పరీక్షించేందుకు ఒకనాడు పరమేశ్వరుడే జంగమదేవర రూపంలో వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. మా ఇంట భోజనం చేయమని ఆ దంపతులు ప్రార్థించారు. నాకు నరమాంసం వండిపెడితే తింటానన్నాడు ఆ జంగమ దేవర. ఒక్కసారి వారు అవాక్కయ్యారు. అతిథిని భోజనానికి పిలిచి అన్నం పెట్టకుండా పంపిస్తే మహాపాపం. అలాగని నరమాంసం ఎక్కడనుండి తెస్తారు. ఎవరు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడతారు. అయోమయమై చింతిస్తుంటే వారి కుమారుడు ‘సిరియాళుడు’ ‘‘అమ్మా! నాన్నగారూ! దీనికి ఇంత చింత ఎందుకు? నన్ను చంపి నా మాంసంతో అతిథిని తృప్తిపరచండి’’ అంటాడు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా ఆ పని చేయగలరా! వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అపుడా చిన్ని బాలుడు వారితో ‘‘సంసార భ్రమమించుకేనియును మత్స్వాంతంబునన్ లేదు మీ వంశంబీపరిపాటిదా!’’ అని వారికి నచ్చజెప్పి సిద్ధపడేలా చేశాడు. వారు తన కుమారుని చంపి, ఆ మాంసం వండి, అతిథికి వడ్డించారు. ఇంకా పరీక్షించడం మానలేదు పరమేశ్వరుడు. పుత్రులు లేని ఇంట నేను భోజనం చేయను. మీ బిడ్డను పిలవండి అన్నాడు. నిలువునా నీరైపోయారు ఆ పుణ్యదంపతులు. ఆమె గొడ్రాలు కాదు. కాని ఇప్పుడు ఆ బిడ్డ లేడు. ఏం చేయాలో పాలుపోలేదు. ‘ఏంమీకు సంతానం లేదా?’ అని అడిగాడు అతిథి. ఇంతకుముందు వరకూ కుమారుడున్నాడు. కాని ఇప్పుడు లేడన్నారు ఆ దంపతులు. లేకపోతే వస్తాడు. గట్టిగా పిలవండి. అన్నాడు అతిథి. ఏమనాలో తెలియక ‘‘నాయనా సిరియాళా! ఎక్కడున్నా వెంటనే రా! నీ కోసం అతిథి నిరీక్షిస్తున్నాడు’’ అని గట్టిగా అరిచారు. ఆశ్చర్యం. ఆడుకొంటున్న పిల్లవాడు తల్లి పిలవగానే బయటి నుండి ఇంటికి వచ్చినట్లుగా గబగబ లోనికి వచ్చాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తాను పెట్టిన పరీక్షలో వారు కృతార్థులైనట్లు చెప్పి ఆశీర్వదించాడు. ఆ రకంగా బాల్యంలోనే శివునికి ఆహారంగా తనను తాను సమర్పించుకోవడానికి ఏమాత్రమూ సంకోచించక రోట్లో తలపెట్టిన సాహసిక బాలభక్తుడు సిరియాళుడు. శంకరాచార్యులు ఆధునిక చారిత్రక కాలానికి వస్తే శంకరాచార్యులు బాల్యంలోనే మహాభక్తుడు కావడమే కాదు, భారతదేశమంతా పాద చారియై సంచరించి, ఎన్నో ఆధ్యాత్మిక పీఠాలను స్థాపించి, నాస్తిక వాదాలను ఖండించి, అసంఖ్యాకంగా గ్రంథాలను వ్రాసి, ముఖ్యంగా ప్రస్థానత్రయమనే వేదాంతశాస్త్రానికి మహాభాష్యాన్ని అందించిన మహనీయుడు. వాని తల్లిదండ్రులు కూడా శివకటాక్షంతో శంకరునికి జన్మనిచ్చారు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరుగుతూ చిన్న వయసులోనే భగవంతునియందు అచంచలమైన భక్తిని సముపార్జించుకోవడమే కాక, తన మనసు నిండా వైరాగ్యభావాన్ని నింపుకొన్నాడు. సంసారమంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే సంసారంపై విరక్తిని పెంచుకొన్నాడు. సన్యాసిగా జీవితాన్ని గడపాలనుకొన్నాడు. కాని తల్లి అందుకు అంగీకరించలేదు. తల్లి అనుమతి లేనిదే సన్యాసదీక్షను స్వీకరించేందుకు అర్హత లేదు. ఎలా అయినా ఆమెను ఒప్పించాలని, చిన్ననాటి నుండే తపస్సు ప్రారంభించాడేమో ఆ శక్తితో తల్లి చూస్తుండగా ఒక నదిలో స్నానం చేస్తూ ఒక కపటపు మొసలిని సృష్టించాడు. అది వాని కాలిని పట్టుకొని నీటిలోనికి లాగసాగింది. ‘‘అమ్మా! నన్ను మొసలి పట్టుకొంది. నన్ను నీటిలోనికి లాగేస్తోంది’’ అని వాపోయాడు. పాపం తల్లి గట్టు మీద నుండే ఏడుస్తూ కేకలు వేస్తోంది. ‘‘అమ్మా! సన్యాసిని మొసలి తినదు. కనుక నేను సన్యాస దీక్ష తీసికోవడానికి నీవు అనుమతిని ఇస్తే ఇప్పటికిప్పుడే సన్యాసదీక్షను తీసికొంటాను. మొసలి నన్ను వదిలేస్తుంది. నేను బతుకుతాను’’ అన్నాడు. బిడ్డ బతికితే అదే చాలు అనుకొని ‘‘అలాగే’’ అని అనుమతినిచ్చింది తల్లి. అంతే మొసలి మాయమైపోయింది. శంకరుడు సన్యాసిగా బయటికి వచ్చాడు. శంకరాచార్యులయ్యాడు. జగద్గురువుగా మిగిలిపోయాడు. ఇలా బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. మన పిల్లలకు వారి చరిత్రలను చెప్పాలి. వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే తీర్చిదిద్దాలి. అప్పుడే భావి ప్రపంచం ప్రశాంతంగాను, ఉదాత్తంగాను, సంస్కారవంతంగాను జీవిస్తుంది. నేటి బాలలే రేపటి మహాభక్తులు. - గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ -
బియాస్ నదిలో గల్లంతైన ప్రహ్లాదుడు మృతి
రుద్రవరం: ఒక్కగానొక్క కుమారుడు నదిలో గల్లంతయ్యాడని తెలిసి ఆ వృద్ధ తల్లిదండ్రుల గుండె పగిలింది. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడం రోజురోజుకూ కుంగదీసింది. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడనే ఆశ.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తున్న వారికి చేదు వార్త అందనే అందింది. ఏదైతే జరగకూడదని అనుకున్నారో ఆ ఘోరం చెవినపడింది. చేతికందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి మండల పరిధిలోని ఆలమూరుకు చెందిన ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొర్రె పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మలకు ఇరువురు కుమార్తెలు, కుమారుడు ప్రహ్లాదుడు(24) సంతానం. ఇతను గత నెల 5న హిమాచల్‌ప్రదేశ్‌లోని దండి జిల్లాలో ఉన్న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రకు వరుసకు మామ అయిన మురళి టూర్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. అక్కడ ఓ చిరుద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరగా ఉండాలని వెళ్లిన ప్రహ్లాదుడుని ఆయన తన వెంటతీసుకెళ్లాడు. నది వద్ద విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా సమీపంలోని లార్జి డ్యాం నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో వారిని అప్రమత్తం చేయబోయి ప్రహ్లాదుడు కూడా కొట్టుకుపోయాడు. గాలింపు చర్యల్లో భాగంగా బియాస్ నదిలో అతని మృతదేహం లభించినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని రుద్రవరం తహశీల్దార్ వెంకటేశ్వర్లు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రహ్లాదుడు చిరుద్యోగం చూసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లి మృత్యువాత పడిన ఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నింపింది. ఇప్పటికే అనారోగ్యంతో మంచంపట్టిన మృతుని తల్లిదండ్రులు ఈ విషాద వార్తతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం బుధవారం ఉదయం గ్రామానికి చెరనుండటంతో కడసారి చూపునకు వారు గుండెలు చిక్కబట్టుకుని ఎదురుచూస్తున్నారు. -
తనయుడి చూపు కోసం ఆ తండ్రి....
రుద్రవరం: తనయుడి చూపు కోసం ఆ తండ్రి తపిస్తున్నాడు. తన కుమారుడు సజీవంగా తిరిగివస్తాడో లేదోననే ఆందోళనతో మంచం పట్టాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే. వీరితోపాటు కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ కుమారుడు ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు. తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయ చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ.. నాగిశెట్టి కుటుంబాన్ని పోషించుకొనేవాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం వెన్నునొప్పి రావడంతో ఆపరేషన్ చేయించుకొనేందుకు, అలాగే కుమారుని చదువు కోసం రూ. 2 లక్షల మేర అప్పు చేశాడు. ప్రస్తుతం ఆలమూరు సిండికేట్ బ్యాంక్‌లో రూ. 80 వేలు, వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 1.20 లక్షల అప్పు ఉంది. ఈయన కుమారుడు ప్రహ్లాదుడు ఆర్థిక సమస్యలతో ఎంబీఏ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాదులో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి (ప్రహ్లాదుడి సమీప బంధువు.. మామ అవుతాడు)ని ఆశ్రయించాడు. ట్రావెల్ బస్సుతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. కుమారుడు గల్లంతైన విషయం ఒకవైపు.. అప్పుల బాధ మరో వైపు బాధిస్తుండడంతో పెద్ద నాగిశెట్టి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మంచం దిగలేని స్థితిలో ఉన్నాడు. భార్య వృద్ధురాలు కావడంతో ఆయన ఆలనాపాలనా కుమార్తె లక్ష్మీదేవి చూస్తోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఒక విద్యార్థి శవం లభ్యమైనట్లు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మురళి ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆమె చెప్పారు. గల్లంతైన 24 మంది విద్యార్థులతోపాటు టూర్ కో ఆపరేటర్‌గా ప్రహ్లాదుడి పేరు నమోదు చేశారన్నారు. కంటికి రెప్పలా కాపాడే కుమారుడు లేనప్పుడు తమకు ఈ జీవితం ఎందుకని.. ఉన్న పొలం అమ్మి అప్పులు చెల్లించి విషం తీసుకుంటామని ప్రహ్లాదుడి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. ప్రహ్లాదుడి బంధువులు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిని కలిసి, తల్లిదండ్రుల ఆవేదనను వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కలెక్టర్‌కు ఫైల్ రూపంలో అందించారు. వెంటనే కలెక్టర్.. నంద్యాల ఆర్డీఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వీరికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. -
చివరిచూపు దక్కేనా..
రుద్రవరం : కుటుంబ భారంమోస్తూ అన్ని విధాలుగా అండగా ఉండే తమ కుమారుడు ప్రహ్లాదుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై చివరి చూపుకు కూడా నోచుకోలేక పోతున్నామని ఆలమూరు గ్రామానికి చెందిన కొర్రె పెద్ద నాగిశెట్టి, లక్ష్మీ నర్సమ్మ, అక్కా చెల్లెళ్లు నాగలక్ష్మి,లక్ష్మిదేవిలు కన్నీరుమున్నీరు అయ్యారు. దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం గ్రామంలోని బాధితుడికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించింది. ఈ సందర్భంగా వారు తమ బాధ్యను వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న టూర్ ప్లాన్‌లో మామ మురళిని కలిశాడు. విద్యార్థులు తక్కువగా హాజరు కావడంతో తోడుగా ఉంటాడని మామ తనను తీసుకెళ్లాడన్న విషయం ప్రహ్లాదుడు ఈ నెల ఒకటో తేదీ ఢిల్లీ నుంచి ఫోన్లో తమకు సమాచారం అందించాడని కుటుంబసభ్యులు తెలిపాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది సమీపంలో రోడ్డుపై బస్సు వద్ద మామ మురళితో ప్రహ్లాదుడు ఉండగా విద్యార్థులు నదిలో ఆడుకుంటూ, ఫొటోలు దిగుతున్నారని నదిలో నీటి ప్రవాహం పెరగడంతో సమాచారం తెలియజేసేందుకు వెళ్లి ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చే క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుక పోయి గల్లంతు అయ్యాడని తల్లిదండ్రులు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: భూమా అఖిల ప్రియ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నాన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పమన్నాడని తెలిపింది. బాధితుడి బంధువులు, గ్రామస్తులతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ రుద్రవరం మండల ఇన్చార్జి పత్తి సత్యనారాయణ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రహ్లాదుడు గల్లంతైన విషయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి నాన్న భూమా నాగిరెడ్డి తీసుకెళ్లాడన్నారు. భాదితుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం సరిపోదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వత్తిడి పెంచి సాయం పెంచేలా కృషి చేస్తాడని చెప్పింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రూ.1.50 లక్షల తక్షణ ఆర్థికసాయం ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ.5లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించే ఆర్థికసాయం భాదిత కుటుంబానికి అందేటట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీవీ రామిరెడ్డి, బంగారు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సహనంతోనే విజ్ఞత సాధ్యం
అసహనం జ్ఞాన విచక్షణలను క్షణంలో పెడదారి పట్టించగలదని చెప్పే వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. వ్యాస విరచితమైన మహాభారతంలో ధర్మరాజు, ద్రౌపది, భీముడు మధ్య జరిగిన ఒక సంవాదంలో కూడా సహనం, దాని ఫలితం, స్వభావం గురించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బలి తన తాతగారైన ప్రహ్లాదుడిని అడిగిన సంశయాన్ని ప్రస్తావించి ద్రౌపది ఈ చర్చకు తెరలేపుతుంది. ‘సహనం గొప్పదా? క్షాత్రం గొప్పదా? ఏది శ్రేయస్కరం?’ అని బలి అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు జవాబిస్తూ ‘రెండూ అతిగా ఉండరాదు. సహనం ఎక్కువైతే నీకింద పనిచేసేవాళ్లు కూడా నీ మాట లక్ష్యపెట్టరు. ఇక అతి కోపాన్ని క్షాత్రంగా భావిస్తే సర్వనాశనం తప్పదు’ అని చెప్పాడు. ద్రౌపది ధర్మరాజుకు ఈ వృత్తాంతం చెప్పి కౌరవుల విషయంలో అతి సహనం పనికిరాదని సూచించింది. కానీ, ధర్మజుడు అంగీకరించలేదు. ‘దెబ్బతిన్నవాడు దెబ్బకొట్టినవాడిని దెబ్బతీస్తూ పోతే ఇక ఈ లోకంలో ఎవడూ మిగలడు’ అంటూ ‘సహనంతోపాటు క్షమాగుణమే జీవనశాంతినిస్తుంది. ఈ రెండూ మహనీయగుణాల’ని ద్రౌపదిని చల్లబరిచేందుకు ప్రయత్నించాడు. ద్రౌపది సహనం కోల్పోయింది. ‘నీకూ, నీ బుద్ధికీ మోహం కలిగించిన విధి, ప్రారబ్ధాలకు ఓ నమస్కారం’ అని ధర్మజుడిపై చిరాకుపడిందామె. జ్ఞాన సముపార్జన కావాలనుకుంటూనే అందుకు చదువుకోవాలన్న విషయంలో సహనంలేని రుషిపుత్రుడి కథ మరోటి ఉంది. భరద్వాజ మహర్షి కొడుకు యువక్రీతుడు ఎలాంటి గట్టి అధ్యయనం లేకుండా వేదాలు, వాటి సారం తెలుసుకోవాలన్న ఆలోచన చేశాడు. ‘సూక్ష్మంలో మోక్షం’ అన్నట్టుగా దానికోసం యాగం చేశాడు. కృషి, సహనం, పట్టుదల లేనిదే వేదాధ్యయనం సాధ్యంకాదని యువక్రీతుడికి మారువేషంలో వచ్చిన ఇంద్రుడు హితోపదేశం చేశాడు. తననే ఉదహరించుకుంటూ జన సౌకర్యం కోసం గంగానదిపై ఉత్త ఇసుకతో వంతెన నిర్మించే పనిచేయబోయి ఎలా భంగపడ్డాడో చెప్పాడు. గోగ్రహణంలో విజయుడై తిరిగొచ్చినది తన కొడుకు ఉత్తరుడని, బృహన్నల కాదని వాదించి, సహనం కోల్పోయి తన చేతిలోని పాచికలను కంకుభట్టుగా తన కొలువులో ఉంటున్న ధర్మరాజు మొహాన కొట్టాడు విరటుడు. ఈ ఘటన తర్వాత విరటుడు జరిగినదానికి విచారం వ్యక్తంచేశాడు. ధర్మరాజు కూడా స్థిమితపడ్డాడు. అయితే, ఈ సంగతి తెలుసుకున్న పాండవ సోదరులు మాత్రం విరటుడిని తొక్కిపడేద్దామనుకున్నారు. అటు తర్వాత సహనం కోల్పోవడం మంచిది కాదని గ్రహించి శాంతపడ్డారు. అయితే, ఎంతో సహనంగా ఉండే ధర్మరాజు సైతం కంకుభట్టు వేషం తీసేసి విరటునికి తామెవరిమో చెప్పాక సహనం కోల్పోతాడు. తిన్నగా వెళ్లి విరటుడి సింహాసనంపైనే కూర్చున్నాడు! ఎంతటివారైనా సహనం, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అసహజమేమీ కాదని, సహనం వహించి సత్ఫలితాలు సాధించేవరకూ కృషిచేసేవారే విజ్ఞులనీ, విజేతలనీ భారతం పలుమార్లు ఉదాహరణ సహితంగా చెబుతుంది. తల్లావ ఝ్జల శివాజి -
యడ్డితో బీజేపీ నేతల భేటీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో బీజేపీ నేతలు గురువారం రాత్రి భేటీ అయ్యారు. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పలికారు. మొదట బీజేపీ కార్యాలయంలో గురువారం ఉదయం కోర్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద నిర్వహించారు. అనంతరం రాత్రి ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ అనంతకుమార్ యడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. కాగా, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఆయనకు అధికారిక సందేశం అందనుంది. ప్రస్తుతం ధనుర్మాసం కన ుక సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీలో చేరనున్నారు. భేటీ అనంతరం జోషి, కేఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక యడ్యూర ప్పతో కలిసి రాష్ర్టంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. పార్టీల విలీనానికి ఇరు పార్టీల నేతలూ అంగీకరించినట్లు చెప్పారు. బీజేపీ నుంచి యడ్యూరప్ప వీడటంతోనూ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఇక తామంతా ఏకం కావడంతో రాష్ర్టంలో పార్టీకి పూర్వవైభవం సంతరించుకున్నటై్లందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవశం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కళంకితులను మంత్రి వర్గంలోకి తీసుకున్నందుకు నిరసనగా ఈ నెల 6న నగరంలో నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
శీలమే మూలం!
సకల జీవుల పట్ల దయతో ఉండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా, ఓపికున్నంత వరకు పరులకు మేలు చేయడం, ఎదుటివాడు తప్పు చేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించడం, అందరూ మెచ్చుకునేటట్లుగా మంచిగా ప్రవర్తించటం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణం. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని వైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్లి తన దుగ్ధ వెళ్లబోసుకున్నాడు దుర్యోధనుడు. ‘‘నాయనా! నాకు మాత్రం తక్కువ ఐశ్వర్యం ఉందా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవైతే సకల సంపదలూ పొందగలవు’’ అంటూ శీల సంపద గురించి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు ఒక కథ చెప్పాడు. ‘‘ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పాలన చేయగల సమర్థుడు. ఇంద్రరాజ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడిని అక్కడి నుంచి తరిమివేసి ధర్మయుక్తంగా పాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ఇంద్రలోకాధిపత్యం మళ్లీ వచ్చే విధానం చెప్పవలసిందంటూ సురగురువైన బృహస్పతిని ప్రార్థించాడు. బృహస్పతి భార్గవుడిని అడగమన్నాడు. ఇంద్రుడు వెళ్లి భార్గవుడిని ఆశ్రయించాడు. అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకుని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో’’ అని సలహా ఇచ్చాడు భార్గవుడు. ఇంద్రుడు విప్రుని వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నమయ్యాడు. ‘‘నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు’’ అని అడిగాడు. ‘‘అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది’’ అన్నాడు శచీపతి వినయంగా. ‘‘ఏముంది, నేను ఎప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరు ఏది అడిగినా లేదనకుండా, కాదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం ఉన్నది కనుక ఇంతటి మహోన్నత పదవి లభించింది నాకు’’ అన్నాడు ప్రహ్లాదుడు. ‘‘అయ్యా! మీరు నిజంగా మహాత్ములు. దానశీలురు. నాయందు దయ ఉంచి మీ శీల సంపదను నాకు ఇవ్వండి’’ అని ఇంద్రుడు ప్రహ్లాదుని దీనంగా యాచించాడు. ‘ఎంత దీనంగా అర్థిస్తున్నాడు’ అనుకుని ‘సరే’అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు. ఆ తరువాత ప్రహ్లాదుని శరీరం నుంచి మహాతేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు. ‘‘నువ్వెవరు’’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. ‘‘నేను శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా, అతని దగ్గరకు వెళ్లిపోతున్నాను’’ అని వెనుతిరగకుండా వెళ్లిపోయాడు ఆ దివ్యపురుషుడు. ఆ వెనుకే ప్రహ్లాదుని శరీరం నుంచి సత్యం, రుజువర్తన, బలం కూడా మెల్లగా బయటకు వెలువడటం ప్రారంభించాయి. చివరగా అతిలోక సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ అతని శరీరం నుంచి బయటకు వచ్చింది. ‘‘నువ్వెవరు తల్లీ?’’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. ‘‘నేను లక్ష్మిని, బలం ఎక్కడుంటే అక్కడ ఉంటాను. వెళుతున్నాను’’ అంది లక్ష్మీదేవి. ‘‘అయ్యో తల్లీ! నన్ను విడిచి వెళుతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్లూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?’’ అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు. ‘‘అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటిపెట్టుకుని మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను ఉంటాం. కనుకనే అన్నింటి కీ ‘శీలమే మూలం’ అని చెప్తారు. నువ్వు శీలాన్ని పోగొట్టుకున్నావు కనుక నేను ఇక నీ దగ్గర ఉండటం అసంభవం’’ అని చెప్పి వెళ్లిపోయింది శ్రీదేవి. ‘‘కనుక, దుర్యోధనా, శీలవంతుడవై వర్థిల్లు’’ అని దుర్యోధనుడికి హితవు చెప్పాడు ధృతరాష్ర్టుడు. - శొంఠి విశ్వనాథం