సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో బీజేపీ నేతలు గురువారం రాత్రి భేటీ అయ్యారు. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పలికారు. మొదట బీజేపీ కార్యాలయంలో గురువారం ఉదయం కోర్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద నిర్వహించారు. అనంతరం రాత్రి ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ అనంతకుమార్ యడ్డితో భేటీ అయ్యారు.
పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. కాగా, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఆయనకు అధికారిక సందేశం అందనుంది. ప్రస్తుతం ధనుర్మాసం కన ుక సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీలో చేరనున్నారు. భేటీ అనంతరం జోషి, కేఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక యడ్యూర ప్పతో కలిసి రాష్ర్టంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. పార్టీల విలీనానికి ఇరు పార్టీల నేతలూ అంగీకరించినట్లు చెప్పారు.
బీజేపీ నుంచి యడ్యూరప్ప వీడటంతోనూ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని, ఇక తామంతా ఏకం కావడంతో రాష్ర్టంలో పార్టీకి పూర్వవైభవం సంతరించుకున్నటై్లందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్థానాలను కైవశం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కళంకితులను మంత్రి వర్గంలోకి తీసుకున్నందుకు నిరసనగా ఈ నెల 6న నగరంలో నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
యడ్డితో బీజేపీ నేతల భేటీ
Published Fri, Jan 3 2014 2:56 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement