
జెనీలియా
‘సై’, ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా జెనీలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జెనీలియా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్‌కు జోడీగా ఆమె ఓ సినిమాలో ఎంపికయ్యారని బాలీవుడ్ టాక్.
ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు జెనీలియాను తీసుకున్నారని, ఆర్‌ఎస్ ప్రసన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరి.. ఆమిర్‌కు జోడీగా జెనీలియా కనిపిస్తారా? చూడాలి. మరోవైపు దశాబ్దం తర్వాత ‘జూనియర్’ అనే తెలుగు సినిమాలో జెనీలియా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక 2012లో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ తెలుగులో హీరోయిన్‌గా జెనీలియా నటించిన చివరి చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment