
ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్‌లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్‌కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్‌హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment