inaugarated
-
నూతన ఓటీటీ హిమాన్షు..
సాక్షి, సిటీబ్యూరో: నగర వేదికగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాతో పాటు హిమాన్షు గ్రూప్ ఎండీ సంజీవ్ పూరి ప్రారంభించారు. ఈ వేదికగా ప్రకటనలకు సంబంధించిన షూట్లు, భారీ–బడ్జెట్ సినిమా నిర్మాణాలు, దర్శకత్వం ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు సంస్థ కేంద్రంగా పనిచేయనుంది. భారీ సినిమాలకు, పలు వినోద కార్యక్రమాలకు వేదికైన హైదరాబాద్ కేంద్రంగా.. పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో మరిన్ని సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని సంస్థ వ్యవస్థాపకులు హిమాన్షు దేవ్కేట్ తెలిపారు. హిమాన్షు ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్, నెట్ ఫ్లిక్స్ సహా పలు వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో, స్టార్హీరోలతో నిర్మిస్తున్న తెలుగు సినిమాల్లో పని చేస్తోందని వివరించారు. -
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం
-
దేశంలో డేటా సైన్స్ రంగం వేగంగా పుంజుకుంటోంది: కేటీఆర్
-
Hyderabad: బాలానగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
పచ్చదనంలో దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాన్ని సాధించిన మాదిరిగానే సీఎం కేసీఆర్ హరిత ఉద్యమాన్ని సైతం విజయవంతం చేస్తారని ఆకాంక్షించారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో రూ.3.45 కోట్ల వ్యయంతో నిర్మించిన తంగేడువనం పార్కును మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకీ) విధానంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మంత్రులు పార్కు అంతా కలియతిరిగారు. అలాగే ధర్మోజిగూడెంలోని లక్కారం –1 బ్లాక్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి 30 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ఇప్పటికే 60 అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అడవులకు పునర్జీవం పోసేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు విస్తరిస్తామన్నారు. హైదరాబాద్–విజయ వాడ 65వ నంబర్ జాతీయ రహదారి వెంట నాటిన విధంగానే గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట సైతం మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.శోభ, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, కలెక్టర్ అనితారామచంద్రన్, అటవీశాఖ సీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అతిపెద్ద ఎలివేటెడ్ ప్రాజెక్టు షురూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎలివేటెడ్ రోడ్ హిందన్ రోడ్ ప్రాజెక్టును యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ప్రారంభించారు. మీరట్ మీదుగా ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు ఈ రోడ్డు ద్వారా ప్రయాణీకులు అత్యంత వేగంగా చేరుకోవడం సాధ్యమవుతుంది. రూ 1147 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణీకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం సైతం ఆదా కానుంది. షెడ్యూల్ ప్రకారం 2017లోనే ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, నిర్మాణ పనుల్లో జాప్యంతో ఆలస్యమైంది. 10.3 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలూ అలుముకున్నాయి. ప్రాజెక్టును చేపట్టిన ఘనత తమదేనని, 90 శాతం పనులు తమ హయాంలోనే సాగాయని ఎస్పీ చెబుతుండగా, ప్రాజెక్టును పూర్తిచేసి ప్రారంభించడం ద్వారా క్రెడిట్ కోసం బీజేపీ పాకులాడుతోంది. -
ఢిల్లీలో వైఎస్సార్సీపీ కార్యాలయం
-
ఢిల్లీలో వైఎస్సార్సీపీ కార్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. విఠల్‌భాయ్ పటేల్ హౌస్(వీపీ హౌస్)లో కేటాయించిన క్వార్టర్లో పూజాకార్యక్రమంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మేకపాటి, వరప్రసాదరావు మీడియాతో పేర్కొన్నారు. -
టెన్త్ తర్వాత కూడా చదువుకుంటాం..పెళ్లి చేసుకోం!
సిద్దిపేట: పదో తరగతి పూర్తయిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోబోమని, ఉన్నత చదువులు చదువుకుంటామని కస్తూరిభా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రమాణం చేశారు. నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, వ్యవసాయ చైర్మన్ లింగాల సాయన్న పాఠశాలలో బుధవారం ఉదయం డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఈవో అర్జున్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థినులు తమకు ఒక హామీ ఇవ్వాలని కోరారు. పేద కుటుంబాల వారు తమ బిడ్డలు మంచి చదువులు చదివి ప్రయోజకులు కావాలని కలలు కంటున్నారని అన్నారు. అయితే, ఎక్కువ మంది పదో తరగతి పూర్తి కాగానే పెళ్ళిళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా, ఉన్నత చదువులు చదివిన తర్వాతే వివాహం చేసుకొనేలా తమకు మాట ఇవ్వాలని కోరారు. దీంతో విద్యార్ధినులంతా ఒక్కసారిగా తాము టెన్త్ అయిపోగానే ఎట్టి పరిస్ధితుల్లో వివాహం చేసుకోమని, ఉన్నత చదువులు పూర్తి చేసే వరకూ పెళ్ళి మాట ఎత్తమని, మాటే కాదు ప్రమాణం చేసి చెబుతున్నామని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
పాఠశాలలో చేతి పంపు ప్రారంభం
లింగాలఘణపురం: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం బాల వికాస ఆధ్వర్యంలో వేసిన చేతి పంపును ఉపసర్పంచ్ ఉప్పలయ్య ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పాఠశాలలో తాగునీటి సమస్య ఉండడంతో సమస్యను స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లగా బోరువెల్ వేసి చేతి పంపును అమర్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకనాధం, ఉపాధ్యాయులు, గ్రామ యువకుల సహకారంతో రూ.6వేలు చెల్లించగా, మిగతా రూ.32వేలు బాల వికాస ఆర్థిక సహాయం చేసి బోరు డ్రిల్లు చేసి చేతి పంపును అమర్చారు. పాఠశాలలోని విద్యార్థులకు తాగునీటి సమస్య తీరడంలో సహకరించిన స్వచ్ఛంద సంస్థకు గ్రామస్తులు, హెడ్మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ భీమయ్య, ఉపాధ్యాయులు భగవాన్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటయ్య, శ్రీనివాసు, వంశీ, హేమలత, మాధవిలత, సుమతి, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.