
ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. విఠల్‌భాయ్ పటేల్ హౌస్(వీపీ హౌస్)లో కేటాయించిన క్వార్టర్‌లో పూజాకార్యక్రమంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పీవీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మేకపాటి, వరప్రసాదరావు మీడియాతో పేర్కొన్నారు.