హ్యేపీ ఇండిపెండెన్స్ డే! | Tollywood Actors Wishes Happy Independence Day | Sakshi
Sakshi News home page

హ్యేపీ ఇండిపెండెన్స్ డే!

Published Thu, Aug 15 2013 9:13 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

హ్యేపీ ఇండిపెండెన్స్ డే! - Sakshi

హ్యేపీ ఇండిపెండెన్స్ డే!

67వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా ప్రముఖులు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులమైనందుకు గర్వపడుతున్నామని, దేశం గర్వించేలా ఏదైనా చేయాలని పలువురు పేర్కొన్నారు. మాతృభూమిలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

హ్యేపీ ఇండిపెండెన్స్ డే.. భారతీయుడినని గర్వించు.. జైహింద్ అంటూ హీరో రామ్ ట్విట్ చేశారు. వందేమాతరం అంటూ హీరో రామ్ చరణ్ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులకు రచయిత కోన వెంకట్ వందనాలర్పించారు. స్వతంత్ర భారతావనికి హీరో సిద్ధార్థ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దేశానికి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతానన్నాడు.

నిజమైన భారతదేశ పౌరురాలిగా గర్వపడుతున్నానని హీరోయిన్ శ్రియా శరణ్ ట్విట్ చేసింది. భారతదేశం తన నా మాతృభూమి అయినందుకు గర్విస్తున్నానని, ఐ లవ్ ఇండియా అంటూ జెలీనియా పేర్కొంది. శాంతి, అనురక్తితో జీవించాలని ప్రియా ఆనంద్ ఆకాంక్షించింది.

మిత్రులందరికీ పద్మశ్రీ డాక్టర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా ఒకటేనని మంచు మనోజ్ ట్వీట్ పోస్ట్ చేశాడు. మేరా భారత్ మహాన్, భారతీయుడినని గర్వించు అని మంచు విష్ణు పేర్కొన్నారు. దేశం గర్వించేలా ఏదైనా చేయాలని సోనూ సోద్ సూచించాడు. తన 25వ సినిమా టైటిల్ 'హ్యేపీ ఇండిపెండెన్స్ డే' అని తమిళ హీరో ధనుష్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement