హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు | ritesh deshmukh and genelia blessed with second son | Sakshi
Sakshi News home page

హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు

Published Wed, Jun 1 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు

హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు

బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియా డిసౌజా జంటకు మళ్లీ కొడుకు పుట్టాడు. ఇంతకుముందే వీళ్లకు రియాన్ అనే ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. తన పెద్దకొడుకు రియాన్‌కు ఇప్పుడు ఓ తమ్ముడు పుట్టాడని చెప్పాడు.

''హే గయ్స్, మా ఆయి, బాబా (అమ్మ, నాన్న) నాకు ఇప్పుడే ఓ చిన్నారి తమ్ముడిని బహుమతిగా ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ వాడివే.. రియాన్'' అంటూ తన పెద్ద కొడుకు చెబుతున్నట్లుగా రితేష్ ట్వీట్ చేశాడు. వెంటనే బాలీవుడ్ ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరుగా రితేష్ - జెనీలియా జంటకు తమ అభినందనలు తెలిపారు. హుమా ఖురేషి, బొమ్మన్ ఇరానీ, అదితి రావు హైదరీ, రాజ్‌నాయక్, బాబా సెహగల్, సచిన్ జోషి, కమాల్ ఆర్ ఖాన్, వరుణ్ ధావన్, ఆలియా భట్... ఇలా చాలామంది రితేష్, జెనీలియాలను అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement