Riaan
-
హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియా డిసౌజా జంటకు మళ్లీ కొడుకు పుట్టాడు. ఇంతకుముందే వీళ్లకు రియాన్ అనే ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. తన పెద్దకొడుకు రియాన్‌కు ఇప్పుడు ఓ తమ్ముడు పుట్టాడని చెప్పాడు. ''హే గయ్స్, మా ఆయి, బాబా (అమ్మ, నాన్న) నాకు ఇప్పుడే ఓ చిన్నారి తమ్ముడిని బహుమతిగా ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ వాడివే.. రియాన్'' అంటూ తన పెద్ద కొడుకు చెబుతున్నట్లుగా రితేష్ ట్వీట్ చేశాడు. వెంటనే బాలీవుడ్ ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరుగా రితేష్ - జెనీలియా జంటకు తమ అభినందనలు తెలిపారు. హుమా ఖురేషి, బొమ్మన్ ఇరానీ, అదితి రావు హైదరీ, రాజ్‌నాయక్, బాబా సెహగల్, సచిన్ జోషి, కమాల్ ఆర్ ఖాన్, వరుణ్ ధావన్, ఆలియా భట్... ఇలా చాలామంది రితేష్, జెనీలియాలను అభినందించారు. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d — Riteish Deshmukh (@Riteishd) 1 June 2016 -
మరో బిడ్డకు జన్మనిచ్చిన హ..హ..హాసిని
హ హ హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరపించిన జెనీలియా రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే రియాన్ అనే నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. అందుకే తన పెద్ద కొడుకు చెపుతున్నట్టుగా, ' మా అమ్మ నాన్నలు నాకు చిన్ని తమ్ముణ్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక నాబొమ్మలన్ని తనవే' అంటూ రియాన్ ఫోటోతో కలిపి ట్వీట్ చేశాడు రితేష్. హిందీ, తెలుగు, తమిళ సినిమాలో నటించిన జెనీలియా, రితేష్‌తో వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఫోటోలు పోస్ట్ చేస్తున్న జెనీలియా, 'మా అర్హత కన్నా ఎక్కువగా ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d— Riteish Deshmukh (@Riteishd) 1 June 2016Thank you GOD for blessing me much more than I deserve. pic.twitter.com/9gZqpYTmB4— Genelia Deshmukh (@geneliad) 31 May 2016 -
హీరోయిన్ కొడుకు 'ఫస్ట్' లుక్
ముంబయి : సోషల్ మీడియాలో మరో హీరో, హీరోయిన్ కొడుకు ఫస్ట్‌లుక్ హల్చల్ చేస్తోంది. బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన ముద్దుల తనయుడు రియాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నెలల ఈ బుడతడు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు 2014 నవంబర్‌లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. పుత్రోత్సాహంతో ఉన్న ఈ జంట ఎప్పటికప్పుడు బుజ్జాయి వార్తలను ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అబిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ తన కుమారుడి ఫోటోలను తొలిసారిగా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు ఆనందం కలిగించారు. ఆమధ్య హీరో అల్లు అర్జున్ కూడా ఇదేవిధంగా తన ముద్దుల కొడుకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిచేశారు. -
మా అబ్బాయి పేరేంటంటే...?
బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ‘మా బుజ్జి కొండ రాక మాకెంతో ఆనందంగా ఉంది’ అని ఈ దంపతులు పేర్కొన్నారు. తమ కుమారుడి నామకరణోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుక గురించి జెనీలియా చెబుతూ - ‘‘ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల బంధువుల్నీ, స్నేహితుల్నీ కలుసుకోవడం అరుదైపోతోంది. కానీ, మా అబ్బాయి ‘బార్సీ’ (నామకరణోత్సవం) మమ్మల్నందర్నీ ఒకచోటకి చేర్చింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుక చేయడం చాలా ఆనందం అనిపించింది’’ అన్నారు. మా అబ్బాయి పేరేంటో తెలుసా. ‘రియాన్ రితేష్ దేశ్‌ముఖ్’ అని రితేష్, జెనీలియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. -
రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!
ముంబై:బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాల జంటకు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట తీవ్రంగా చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు. తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.