ముంబయి : సోషల్ మీడియాలో మరో హీరో, హీరోయిన్ కొడుకు ఫస్ట్లుక్ హల్చల్ చేస్తోంది. బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ తన ముద్దుల తనయుడు రియాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నెలల ఈ బుడతడు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.
2012లో ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు 2014 నవంబర్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. పుత్రోత్సాహంతో ఉన్న ఈ జంట ఎప్పటికప్పుడు బుజ్జాయి వార్తలను ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అబిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ తన కుమారుడి ఫోటోలను తొలిసారిగా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు ఆనందం కలిగించారు. ఆమధ్య హీరో అల్లు అర్జున్ కూడా ఇదేవిధంగా తన ముద్దుల కొడుకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిచేశారు.
హీరోయిన్ కొడుకు 'ఫస్ట్' లుక్
Published Wed, May 27 2015 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement
Advertisement