డిసౌజా..దేశ్ముఖ్ల మూడు తరాలు | Riteish and Genelia became parents to a baby boy on November 25 | Sakshi
Sakshi News home page

డిసౌజా..దేశ్ముఖ్ల మూడు తరాలు

Published Mon, Dec 1 2014 1:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

డిసౌజా..దేశ్ముఖ్ల మూడు తరాలు

డిసౌజా..దేశ్ముఖ్ల మూడు తరాలు

ముంబయి : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి జెనీలియా డిసౌజా శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమెకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.

తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేసిన జెన్నీ, రితేష్ దేశ్ముఖ్లు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళుతూ మీడియా కంటికి చిక్కారు. ఈ సందర్భంగా వీరిద్దరూ తల్లి, అత్తగార్లతో కలిసి తమ ముద్దుల కొడుకుతో  ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. కొడుకు పుట్టిన ఆనందాన్ని మాత్రం రితేష్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నాడు.

#Thank you all for your Love, Prayers & Blessings - the mother @geneliad n the lil one are doing great. అంటూ ట్విట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement