
నువ్వు నటించడానికే పుట్టావు!
ముంబై: హహ్హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జెనీలియా దేశ్ముఖ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోంది. మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ''చాలా సంతోషంగా ఉంది. త్వరలో షూటింగ్ మొదలు.. మూడేళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నా'' అని జెనీలియా ట్వీట్ చేసింది. జెనీలియా భర్త, నటుడు రితేష్ దేశ్ముఖ్ దాన్ని రీట్వీట్ చేశాడు. ఇది చాలా మంచి రోజు... నువ్వు నటించడానికే పుట్టావు అంటూ సతీమణికి రిప్లై కూడా ఇచ్చాడు.
కాగా తెలుగులో సై, శశిరేఖా పరిణయం, బొమ్మరిల్లు, బాలీవుడ్లో జానే తూ జానే న, తేరే నాల్ లవ్ హో గయా లాంటి సినిమాలలో హీరోయిన్గా మెప్పించిన జెనీలియా బాలీవుడ్కు చెందిన రితేష్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు గత ఏడాది నవంబర్లో ఒక కొడుకు కూడా పుట్టాడు. దీంతో మూడేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న ఈ బొమ్మరిల్లు భామ, తన సెకండ్ ఇన్సింగ్స్ గ్రాండ్గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
On my way to shoot..excited as hell.. Been 3yrs since I last shot but I have a feeling it's going to be a Good Good Day..
— Genelia Deshmukh (@geneliad) August 12, 2015
It's going to be a Greattttt Dayyy - you were born for this. https://t.co/VjWqA8fa9t
— Riteish Deshmukh (@Riteishd) August 12, 2015