బెస్ట్ ఫ్రెండ్ ను కలుసుకున్న రామ్..
బొమ్మరిల్లు, సై, రెడీ లాంటి పలు చిత్రాల్లో నటించి తెలుగులో హీరోయిన్గా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను పెళ్లి చేసుకుని వెండితెరకు తాత్కాలికంగా దూరమైంది. ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా ప్రస్తుతం ఆ సంబరాల్లోనే మునిగి తేలుతుంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, జెనీలియాలు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. షూటింగుల్లో బిజీగా ఉంటున్న రామ్ ఇన్ని రోజులకు తన బెస్ట్ ఫ్రెండ్ను చూసేందుకు వెళ్లాడు. జెనీలియా కుమారుడు చిన్నారి రియాన్తో ప్రేమలో కూడా పడిపోయానంటున్నాడు. జెనీలియా దంపతులతో కొంత సమయం గడిపిన రామ్ ఆ సంతోషాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో ఫ్రెండ్షిప్ డే వస్తుందనగా.. ఈ దోస్తులు ఇలా కలుసుకోవడం బాగుంది కదూ.
With the bestie @geneliad and her sweetest husband @Riteishd .. I'm officially in love with Riaan you guys.. pic.twitter.com/SHhWC5mpoA
— Ram Pothineni (@ramsayz) August 2, 2016