‘తుజే మేరీ కసమ్‌కు పదిహేడేళ్లు... నా మొదటి సినిమా. ఇందులో నా హృదయం అంటే నా భర్త కూడా ఉన్నాడు’ అంటూ హీరోయిన్ జెనీలియా తన భర్త రితేశ్ దేశ్‌ముఖ్‌తో స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘తుజే మేరీ కసమ్’ సినిమాతో జెనీలియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. ఇందులో జంటగా కనిపించిన జెనీలియా- రితేశ్.. షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. పెళ్లికి పెద్దల ఆమోదం లభించకపోవడంతో కొన్నాళ్లు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు రేహిల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాగా వీరిద్దరి బంధానికి బీజం వేసిన ‘తుజే మేరీ కసమ్’ సినిమా విడుదలై(2003) నేటికి సరిగ్గా పదిహేడేళ్లు. ఈ సందర్భంగా తొలి సినిమాలోని పాటలకు స్టెప్పులేసిన ఈ స్టార్ కపుల్... ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మాపై ఇంతగా ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అని భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘ఎల్లప్పుడూ మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి. ప్రేమ బంధాన్ని.. పెళ్లి పీటలు ఎక్కించి మా అందరికీ ఆదర్శంగా నిలిచిన మీ బంధం శాశ్వతంగా నిలిచి ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి సినిమాతోనే రితేశ్- జెనీలియా సూపర్‌హిట్ కొట్టారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టాలీవుడ్ హీరో తరుణ్ ‘నువ్వే కావాలి’ మూవీకి రీమేక్.
Comments
Please login to add a commentAdd a comment