అవకాశాల వేటలో జెనీలియా
అవకాశాల వేటలో జెనీలియా
Published Mon, Aug 12 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
నటి జెనీలియాను దక్షిణాది ప్రేక్షకులు మరచిపోలేరు. కోలీవుడ్‌లో బాయ్స్, సంతోష్ సుబ్రమణియన్, సచ్చిన్, తెలుగులో బొమ్మరిల్లు వంటి చిత్రాలతో ఈమె మంచి గుర్తింపు సాధించింది. హిందీలోనూ కొన్ని చిత్రాలు చేసింది. హీరోరుయిన్‌గా మంచి స్థానంలో ఉండగానే బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత జెనీలియూకు అవకాశాలు తగ్గాయి. ఆమె సైతం అంతగా ఆసక్తి చూపించలేదు.
తాజాగా భర్త మళ్లీ నటించడానికి పచ్చజెండా ఊపడంతో ఈ హాసిని అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది. బాలీవుడ్‌లో అవకాశాల కోసం కొందరు దర్శకులకు రాయబారం పంపినా ప్రయోజనం లేకపోయిందని సమాచారం. దీంతో తనను తారాస్థాయికి తీసుకెళ్లిన దక్షిణాదిపై దృష్టి సారించింది. ముందుగా టాలీవుడ్‌లో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ దర్శక, నిర్మాతలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిందట.
పార్టీ కొచ్చిన వారందరూ బాగా ఎంజాయ్ చేసి జెనీలియాకు అభినందనలు తెలిపి మరీ వెళ్లారట. అవకాశాల మాట మాత్రం నోరెత్తలేదట. దీంతో డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ జెనీలియా తల పట్టుకుని కూర్చొందట. ఇక అమ్మడి దృష్టి కోలీవుడ్‌పై మళ్లింది. ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement