తప్పు చేస్తే డబ్బులిస్తానన్నాడు! | If the wrong PAY THE MONEY | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే డబ్బులిస్తానన్నాడు!

Published Wed, Mar 19 2014 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తప్పు చేస్తే  డబ్బులిస్తానన్నాడు! - Sakshi

తప్పు చేస్తే డబ్బులిస్తానన్నాడు!

 ‘మంచి పనులు చేస్తే.. బహుమతి ఇస్తా’ అని కొంతమంది పందెం కడతారు. కానీ, తప్పు చేస్తే, డబ్బులిస్తానని తమన్నాతో పందెం కట్టారు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. తను జెనీలియా భర్త. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, తమన్నా తదితరుల కాంబినేషన్‌లో ‘హమ్ షకల్స్’ అనే చిత్రం రూపొందుతోంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల రితేష్, తమన్నాలపై ఓ సన్నివేశం తీశారు. అది క్లిష్టమైన సీన్ కావడంతో తమన్నా తడబడ్డారు.


దాంతో, సీన్‌ని మరోసారి విపులంగా వివరించి, ‘ఈసారి సరిగ్గా చెయ్యాలి’ అన్నారట సాజిద్. కానీ, ఆయనకు తెలియకుండా ‘నువ్వు కనుక ఈసారి కూడా తప్పుగా చేస్తే, నీకు వెయ్యి రూపాయలిస్తా’ అని రితేష్ అన్నారట. కోట్లు సంపాదిస్తున్న తమన్నాకి వెయ్యి రూపాయలు చాలా తక్కువే అయినా, ఊరికే వచ్చింది ఎందుకు వదులుకోవాలని, తప్పుగా చేశారట. దాంతో రితేష్ పది వంద నోట్లు లంచం ఇచ్చుకున్నారు. ఇదంతా చేసింది జస్ట్ తమాషా కోసం అని, సైఫ్, రితేష్ లొకేషన్లో ఉంటే ఇలాంటి తమాషాలు బోల్డన్ని చేస్తారని, ఒక్కోసారి వాళ్లు వేసే జోకులకు కుర్చీల్లోంచి కిందపడి మరీ నవ్వి నంత పని చేస్తామని తమన్నా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement