జెనీలియా స్కర్ట్‌తో రితేష్ | Ritesh with genelia skirt | Sakshi
Sakshi News home page

జెనీలియా స్కర్ట్‌తో రితేష్

Published Thu, Jun 5 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

జెనీలియా స్కర్ట్‌తో రితేష్

జెనీలియా స్కర్ట్‌తో రితేష్

 ‘‘నీ మినీ స్కర్ట్ ఒకసారి నాకు ఇస్తావా... వేసుకోవాలనిపిస్తోంది’’ అని భార్యను భర్త అడిగితే... ఖంగు తినడం ఖాయం. ఇటీవల జెనీలియాకు అలాంటి షాకే తగిలింది. అయితే, తన భర్త స్కర్ట్ ఎందుకు అడిగాడో తెలుసుకున్న తర్వాత హాయిగా నవ్వుకున్నారు జెనీలియా. సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, రామ్‌కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తా, తమన్నా ముఖ్య తారలుగా రూపొం దిన చిత్రం ‘హమ్ షకల్స్’. ఇందులో సైఫ్ ఆడవేషంలో కనిపించనున్న విషయం తెలిసిందే.
 
 రితేష్ కూడా ఈ అవతారంలో కనిపించి, అలరించనున్నారు. మినీ స్కర్ట్, పైకి మడిచి ముడివేసిన షర్ట్‌తో వీలైనంత గ్లామరస్‌గా కనిపించాలనుకున్నారు ఆయన. అందుకే తన శ్రీమతి స్కర్ట్ అడిగి తీసుకున్నారు. జెన్నీ, రితేష్‌ల నడుము కొలత ఒకటే కావడం విశేషం. అందువల్లే రితేష్ తన భార్య స్కర్ట్ ధరించి నటించడానికి కుదిరింది. ఆడవేషంలో రితేష్‌ని చూసి, చాలా హాట్‌గా ఉన్నావ్ గురూ అని లొకేషన్లో అన్నారట. జెన్నీకి కూడా ఈ లుక్ బాగా నచ్చిందట.  ఈ నెల 20న సినిమా రిలీజ్ అవు తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement