ఏం ఉందబ్బా హ్యాండ్‌బ్యాగ్‌ డిజైన్‌..! అచ్చం ఆకుకూరలా.. | Moschinos Launches New Sedano Bag That Looks Like Celery Shaped | Sakshi
Sakshi News home page

ఏం ఉందబ్బా హ్యాండ్‌బ్యాగ్‌ డిజైన్‌..! అచ్చం ఆకుకూరలా..

Published Tue, Nov 5 2024 1:28 PM | Last Updated on Tue, Nov 5 2024 4:11 PM

Moschinos Launches New Sedano Bag That Looks Like Celery Shaped

ఎన్నో రకాల బ్రాండెడ్‌ హ్యాండ్‌బ్యాగ్‌లు చూసుంటారు. అందాల భామలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించే అత్యంత లగ్జరియస్‌ బ్యాగ్‌లను ఎన్నో రకాలు చూశాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా అత్యంత వెరైటీ బ్యాగ్‌ని రూపొందించింది ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ మోస్చినో. ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్‌లు అత్యంత హాస్యస్పదమైన రీతిలో బ్యాగ్‌లు డిజైన్‌ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఈ లగ్జరీ బ్రాండ్‌ మోస్చినో కూడా చేరిపోయిందా అనిపిస్తుంది ఈ బ్యాగ్‌ డిజైన్‌ చూస్తే..

ఎలా ఉందంటే..
మోస్చినో మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ హ్యండ్‌ బ్యాగ్‌ అచ్చం కొత్తిమీర కట్టలా కనిపిస్తుంది. అలా రూపొందించాలనే క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అచ్చం ఆకుకూర మాదిరిగా చక్కగా డిజైన్‌ చేశారు. ఇది డిజిటల్ ప్రింట్‌తో కూడిన కొత్తిమీర ఆకృతిలో ఉన్న పర్సు. 

ఇది త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్‌తో కనిపిస్తుంది. ఆ పర్సుపై కనిపించే ఆకులు కూడా సహజత్వం ఉట్టిపడేలా చాలా అద్భతంగా డిజైన్‌ చేశారు. దీని ధర వింటే మాత్రం అంత ఖరీదు అవసరమా అనే ఫీల్‌ తప్పక వస్తుంది. కొత్తిమీర ఆకృతిలో ఉన్న ఈ హ్యండ్‌బ్యాగ్‌ ధర అక్షరాల రూ. 3 లక్షలు పైనే ఉంటుందట. హైరేంజ్‌ ఫ్యాషన్‌ అంటే ఇదేనేమో. ఏం బ్రాండ్‌లో ఏమో..! క్రియేటివిటీలో మేటర్‌ నిల్‌  ధరలు మాత్రం వామ్మో.. అనేలా ఉన్నాయి కదూ..!.

(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్‌ మట్టితో..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement