Aishwarya Lekshmi Reacts on Dating Rumours with Arjun Das - Sakshi
Sakshi News home page

Aishwarya Lekshmi: నా పోస్ట్‌ ఇంతలా పేలుతుందని ఊహించలేదు, అర్జున్‌ మీవాడు

Jan 13 2023 12:59 PM | Updated on Jan 13 2023 2:34 PM

Aishwarya Lekshmi Reacts on Dating Rumours with Arjun Das - Sakshi

వీరిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి వీరి మధ్య ప్రేమ ఎలా కుదిరిందబ్బా? అని నెటిజన్లు ఓపక్క ఆశ్చర్యపోతూనే మరోపక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినీ జంటలు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు.. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఆరేళ్లకు పైగా ప్రేమించుకుని గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. నానుమ్‌ రౌడీదాన్‌ సినిమా షూటింగ్‌ వీరి ప్రేమకు ఆజ్యం పోసింది.ఇంకా నటి స్నేహ నటుడు ప్రసన్నది కూడా ప్రేమ వివాహమే. అచ్చముండు అచ్చముండు చిత్రం షూటింగ్‌ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది.

తాజాగా మలయాళ బ్యూటీ, పొన్నియిన్‌ సెల్వన్‌ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మాస్టర్, ఖైదీ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు అర్జున్‌దాస్‌తో లవ్‌లో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌తో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసిన భామ దానికి లవ్‌ సింబల్‌ను జోడించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి వీరి మధ్య ప్రేమ ఎలా కుదిరిందబ్బా? అని నెటిజన్లు ఓపక్క ఆశ్చర్యపోతూనే మరోపక్క శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే తమది ప్రేమ కాదంటోంది ఐశ్వర్య. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పష్టం చేసింది. 'నా పోస్ట్‌ ఇంతలా పేలుతుందని ఊహించలేదు. మేమిద్దరం సరదాగా కలిశాం, ఓ ఫోటో దిగాం. దాన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశా.. అంతే! మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే, అంతకుమించి మా మధ్య ఏం లేదు. నిన్నటినుంచి ఒకటే పనిగా మెసేజ్‌ చేస్తున్న అర్జున్‌ దాస్‌ ఫ్యాన్స్‌ అందరికీ క్లారిటీ ఇస్తున్నా.. అర్జున్‌ మీవాడు..' అని రాసుకొచ్చింది. ఒక్క పోస్ట్‌తో అర్జున్‌తో డేటింగ్‌ రూమర్స్‌కు చెక్‌ పెట్టింది ఐశ్వర్య.

చదవండి: కొత్త బంగారు లోకం హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
క్యాన్సర్‌తో చచ్చిపోయినా ఓకే కానీ ట్రీట్‌మెంట్‌ తీసుకోను: సంజయ్‌ దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement