
బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. ఈమె నిర్మాత కూడా. మలయాళంలో పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించారు. ఇకపోతే తమిళంలో జగమే తంతిరం, యాక్షన్, కట్టాకుస్తీ, పొన్నియిన్ సెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్,థ్రిల్లర్ థగ్ లైఫ్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.
కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఐశ్వర్య లక్ష్మి తాజాగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని తెలిసింది. యాలీ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తమిళ వెబ్‌సిరీస్‌లో నటి ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా చాలా మంది ప్రముఖ నటీమణులు ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూసుతున్నారు. ఆ కోవలో నటి ఐశ్వర్యలక్ష్మి కూడా చేరుతున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment