యాక్టర్స్‌గా మారిన డాక్టర్స్.. మన చిత్ర పరిశ్రమలో చాలామందే ఉన్నారు. ఆ జాబితాలోకి నటి ఐశ్వర్యా లక్ష్మి కూడా చేరుతుంది. చిన్న పాత్రలో మెరిసి స్టార్‌డమ్ దిశగా దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని విషయాలు..
► ఐశ్వర్యా సొంతూరు తిరువనంతపురం. ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసింది.
► కాలేజీ రోజుల్లోనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.
►మలయాళం, తమిళ భాషల్లో ఎక్కువగా నటించే ఐశ్వర్యా .. ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయింది. ఆ తర్వాత ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’తో మెప్పించింది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ కీలక పాత్ర పోషించింది.
►2017లో మలయాళ చిత్రం ‘న్యంగలుడే నాత్తిల్ ఒరిడవేల’తో వెండి తెర ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఆ చిత్రానికిగాను ఉత్తమ పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. దీంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
►నటిగా రాణిస్తూనే తన అభిరుచి మేరకు నిర్మాతగానూ మారింది. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ నిర్మాతల్లో ఐశ్వర్యా ఒకరు.
►ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘కింగ్ ఆఫ్ కొత్త’తో అలరిస్తోంది.
కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఏ కొంచెం టైమ్ దొరికినా ఇంట్లో వాళ్లకు వండి వడ్డిస్తుంటా!: ఐశ్వర్యా లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment