
ఆయనతో ఒక్కసారైనా చేయాలి
‘ధర్మదురై’, ‘రెక్క’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన బ్యూటీ ఐశ్వర్యాలక్ష్మి. ఇప్పుడు ‘తిరుపతి స్వామి కుటుంబం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్ర విశేషాలను గురించి అమ్మడు మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నేను హీరోయిన్‌గా నటిస్తున్న ‘తిరుపతి స్వామి కుటుంబం’ చిత్రంలో సంప్రదాయ అమ్మాయిగా నటిస్తున్నాను. అయితే తర్వాత నటించనున్న చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటిస్తాను.
నాకు సిమ్రాన్, జ్యోతికా వలే అందంగా అందచందాలను ప్రదర్శించడమే ఇష్టం. నా రోల్‌మోడల్ సమంత. ఆమె తొలి చిత్రం నుంచే సవాలుతో కూడిన పాత్రల్లో నటిస్తున్నారు. కనుక, సమంత లాగా మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆశయం. నాకు నచ్చిన హీరో విజయ్. ఆయన నటించిన అన్ని చిత్రాలను చూస్తున్నాను. ఆయన నడిచి వస్తుంటే అదో మాస్ సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారైనా ఆయనతో డ్యూయెట్ పాడాలని ఉంది. అదే విధంగా అజిత్, సూర్యతో కూడా డ్యూయెట్ పాడాలనేది నా సినిమా కల.
ధర్మదురై చిత్రంలో విజయ్ సేతుపతికి స్నేహితురాలిగా నటించాను. రెక్క చిత్రంలో ఆయనకు చెల్లెలి పాత్రలో చేశాను. ఆయనతో నటిస్తున్నప్పుడు కెమెరా ముందు ఎలా ఉండాలి, ఏవిధంగా నటించాలి వంటి సూచనలు ఇస్తుంటారు. ఆయన భార్య కూడా ప్రోత్సహిస్తుంటారు. కనుక, ఆయన కుటుంబానికి నేను రుణపడి ఉన్నాను. విజయ్‌సేతుపతితో జోడీగా నటించడానికి ప్రయత్నిస్తున్నాను. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను అని ఐశ్వర్యా లక్ష్మి తెలిపింది.